శనివారం 30 మే 2020
Karimnagar - May 13, 2020 , 02:56:46

మీకు తోడుగా మేమున్నామంటూ..

మీకు తోడుగా మేమున్నామంటూ..

జన్నారం : ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కలమడుగు గ్రామంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు ఆధ్వర్యంలో నిరుపేదలకు ఇచ్చిన నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, ఎంపీపీ మాదాడి సరోజన, సింగిల్‌ విండో చైర్మన్‌ రమేశ్‌, సర్పంచ్‌ కార్తీక్‌రావు, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, సతీశ్‌ పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌ : సింగరేణి ఎంప్లాయీస్‌ వైఫ్స్‌ అసోసియేషన్‌ (సేవా) ఆధ్వర్యంలో శ్రీరాంపూర్‌ సేవా భవన్‌లో 50 పేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ, సేవా అధ్యక్షురాలు సరళాదేవి, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, ప్రాజె క్టు ఆఫీసర్‌ శ్రీనివాస్‌, డీవైజీఎం గోవిందరాజు, పీఎం తుకారాం, అసోసియేష న్‌ సభ్యులు జ్యోతి, మంగ, ప్రమీల, తిరుమల, శిరీష, రజిత పాల్గొన్నారు.

లక్షెట్టిపేట రూరల్‌ : బలరావుపేటలో సుమారు 50 మంది ఉపాధి కూలీలకు ఎంపీపీ అన్నం మంగ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీవో వెంకటరమణ, సర్పంచ్‌ కందుల మోహన్‌, పంచాయతీ కార్యదర్శి గోపీచంద్‌ ఉన్నారు.

కాసిపేట:  దేవాపూర్‌, మద్దిమాడ, గట్రావ్‌పల్లి గ్రామాల్లోని 400 మందికి నిత్యావసరాలను ఓసీసీ అధ్యక్షుడు ఎస్‌కే పాండే, యూనిట్‌ హెడ్‌ ఆర్‌వీఆర్‌ మూర్తి, ఏజీఎం లక్ష్మీనారాయణ ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అందజేశారు. టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో కొలాంగూడలో 50 కుటుంబాలకు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ వేణు, జిల్లా కోశాధికారి దిలీప్‌, మండల ప్రధాన కార్యదర్శి రమేశ్‌ కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు.

దండేపల్లి : మండలంలోని తానిమడుగులో ఉపాధి హామీ కూలీలు, హమాలీలకు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మాస్కులను అందజేశారు. దండేపల్లిలో ఉపాధి హామీ కూలీలకు  సర్పంచ్‌ చంద్రకళ, ఎంపీటీసీ శ్రీనివాస్‌ అందజేశారు.

మందమర్రి : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు చెందిన 200 పేద కుటుంబాలకు మున్సిపల్‌ కమిషనర్‌ గద్దె రాజు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మెప్మా సిబ్బంది, రిసోర్స్‌ పర్సన్లు విరాళాలు సేకరించి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మెప్మా టీఎంసీ శ్రీధర్‌ పాల్గొన్నారు. రెండో జోన్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు తొగరి వెంకన్న వివాహ వార్షికోత్సవం సందర్భంగా 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించారు.

తాండూర్‌ : అభినవ సంస్థ అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో 256 మంది పాదచారులు, వలస కూలీలకు దాతలు శ్రీకాంత్‌, రమేశ్‌ మిత్ర బృందం సహకారంతో భోజనం అందించారు. అలాగే 16 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కాసిపేట, రాంపూర్‌, ద్వారకాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని 40 మంది గర్భిణులు, బాలింతలకు వారి ఇంటి వద్దకే వెళ్లి పౌష్టికాహారం, పండ్లను ఎంపీపీ ప్రణయ్‌కుమార్‌, సర్పంచ్‌ రమేశ్‌ అందించా రు. సేవాజ్యోతి శరణాలయానికి కాసిపేటకు చెందిన గొర్లపల్లి విజయలక్ష్మి-శ్యాంరావ్‌ దంపతులు క్వింటాల్‌ బియ్యం, సరుకులు, కోడి గుడ్లు అందజేశారు.

ఆసిఫాబాద్‌ : గోవింద్‌పూర్‌లో 160 మంది నిరుపేదలకు సర్పంచ్‌ గంగుబాయి, ఎంపీటీసీ గాదెవేణి మల్లేశ్‌ ఆధ్వర్యంలో జడ్పీ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చిరువేరు వెంకన్న, మాజీ ఎంపీటీసీ రవీందర్‌, నాయకులు బాబురావు, రమేశ్‌, రావూజీ, నానాజీ, సుధాకర్‌ పాల్గొన్నారు.

కౌటాల : మహారాష్ట్రకు వెళ్తున్న వలస కూలీలకు మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద పులిహోర, అంబలి పంపిణీ చేశారు. దాతలు మల్లోజుల చంద్రశేఖర్‌శర్మ, గోలేటి శంకర్‌, కౌటాల సహాయ సంఘం సభ్యులు ఉన్నారు.


logo