బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 12, 2020 , 01:41:26

యువ రైతుకు గంగుల అభినందన

యువ రైతుకు గంగుల అభినందన

  • ‘నమస్తే’ కథనానికి స్పందన

రామడుగు: తిర్మలాపూర్‌కు చెందిన యువరైతు కట్ల శ్రీనివాస్‌పై ‘నమస్తే తెలంగాణ బతుకమ్మ’లో ఆదివారం వచ్చిన కథనం చూసి పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్‌ ఆయనను అభినందించారు. ముందుగా శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలుపగా, సోమవారం రైతు అంజీర తీసుకువచ్చి మంత్రి గంగులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు రానున్న రోజుల్లో శ్రీనివాస్‌ను ఆదర్శంగా తీసుకొని వినూత్న పంటలు సాగు చేయాలని సూచించారు.


logo