బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 10, 2020 , 02:39:27

ఎల్‌ఎండీకి 5 టీఎంసీల నీరు

ఎల్‌ఎండీకి 5 టీఎంసీల నీరు

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలు
  • వెంటనే విడుదల చేసిన అధికారులు 
  • మంత్రులు ఈటల, గంగుల విజ్ఞప్తిపై స్పందించిన ముఖ్యమంత్రి 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీ రాజరాజేశ్వర (ఎస్సారార్‌) జలాశయం నుంచి లోయర్‌ మానేరు డ్యాంకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలు జారీచేశారు. ఆ మేరకు శనివారం సాయంత్రం ఎస్సారార్‌ జలాశయం నుంచి ఒక గేటు ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ప్రస్తుతం నిత్యం మంచినీటి సరఫరా చేయడానికి ట్రయల్న్‌ కొనసాగుతున్నది. మూడు రోజులుగా విజయవంతంగా ట్రయల్న్‌ సాగుతుండగా.. అధికారికంగా మరో వారం రోజుల్లో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని ద్వారా నిత్యం నీటి సరఫరా చేసే తొలి కార్పొరేషన్‌గా కరీంనగర్‌ రికార్డులకెక్కబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ముఖ్యమంత్రి శనివారం హైదరాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆ మేరకు.. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో నిత్యం నీటి సరఫరా చేయడానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉండాలంటే లోయర్‌మానేరు డ్యాంలో 10 టీఎంసీల నీళ్లు ఉండాలని, ప్రస్తుతం ఏడు టీఎంసీల నీరు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఐదు టీఎంసీల నీటిని ఎస్సారార్‌ జలాశయం నుంచి లోయర్‌మానేరు డ్యాంకు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలిపారు. తమ విజ్ఞప్తిపై వెంటనే స్పందించారని, ఆ మేరకు ఎస్సారార్‌ జలాశయం అధికారులకు ఆదేశాలు జారీచేశారని మంత్రులు ఒక ప్రకటనలో తెలిపారు.logo