గురువారం 04 జూన్ 2020
Karimnagar - May 08, 2020 , 06:35:26

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం

  • ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
చొప్పదండి, నమస్తేతెలంగాణ :  పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కొనియాడారు. చొప్పదండిలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ ఆధ్వర్యంలో గురువారం పారిశుధ్య కార్మికులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే హాజరై వడ్డించారు. అనంతరం కార్మికులతో కలిసి భోజనం చేశారు. లాక్‌డౌన్‌లో సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, పారిశుధ్య కార్మికులకు రుణపడి ఉంటామన్నారు. అంతకుముందు జడ్పీ పాఠశాలలో పీఆర్‌టీయూ కరీంనగర్‌ శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి, రామడుగు మండలాల్లో పనిచేస్తున్న సర్వీస్‌ పర్సన్లకు, హోలీఫా చర్చిలో తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో పాస్టర్లకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇక్కడ ఎంపీపీ చిలుక రవీందర్‌, జడ్పీటీసీ మా చర్ల సౌజన్య, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి, సింగిల్‌ విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని సమత, మమతకు ఎమ్మెల్యే రవిశంకర్‌ భరోసా ఇచ్చారు. అనాథలుగా మారిన అక్కాచెల్లెళ్లకు సీఐడీ సీఐ నాగేశ్వర్‌రావుగౌడ్‌, తిమ్మాపూర్‌ సీఐ తాళ్లపల్లి మ హేశ్‌గౌడ్‌, ట్రాఫిక్‌ సీఐ తిరుమల్‌గౌడ్‌, జగిత్యాలకు చెందిన డాక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, వ్యాపారవేత్తలు వంశీకృష్ణ, శేషాద్రి గౌడ్‌, ఎన్‌ఆర్‌ఐ నవీన్‌ రూ.లక్ష విలువైన చెక్కును గురువారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.


logo