శనివారం 30 మే 2020
Karimnagar - May 06, 2020 , 01:54:42

ధాన్యం, మక్కల కొనుగోళ్లు పర్యవేక్షించాలి

ధాన్యం, మక్కల కొనుగోళ్లు పర్యవేక్షించాలి

  • కలెక్టర్‌ శశాంక

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని వరిధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను నిత్యం పర్యవేక్షించాలని, కొన్న ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని కలెక్టర్‌ శశాంక సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్ల యి, ఐకేపీ, కో ఆపరేటివ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జాప్యమవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాములు ఎవరి వద్ద ఉన్నా గుర్తించి లీజుకు తీసుకోవాలని సూచించారు. మక్కల సేకరణ, ధర పెంపు విషయమై మార్క్‌ఫెడ్‌ అధికారులతో సంప్రదించాలన్నారు. కరీంనగర్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేనందున ప్రధాన రహదారి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఎస్సీ కార్పొరేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. వారితో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.


logo