పంజాబీ సోయగం మెహ్రీన్ కౌర్ మార్చి 12న హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరుపుకున్న విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థానాకి సంబంధించిన ఫొటోలను మెహ్రీన్ తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయగా, ఇవి వైరల్‌గా మారాయి. వారిద్దరికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే వివాహం ఎప్పుడు ఉంటుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఈ ఏడాది శీతాకాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మెహ్రీన్.
రెండు రోజుల పాటు తమ వివాహం జరగనుందని చెప్పుకొచ్చిన మెహ్రీన్ ముందుగా పంజాబీ శైలిలో గురుద్వార్ వేదికగా జరగనుందని పేర్కొంది. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని స్పష్టం చేసింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే దానిపై కూడా మెహ్రీన్ క్లారిటీ ఇచ్చింది. పెళ్లయ్యాక కూడా తప్పక సినిమాలలో నటిస్తాను. నన్ను అర్ధం చేసుకునే భర్త దొరికినందుకు సంతోషిస్తున్నాను. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటాను. పెళ్లయ్యాక ఢిల్లీకి మకాం మారుస్తాను అంటూ మెహ్రీన్ కౌర్ పేర్కొంది