ఆదివారం 31 మే 2020
Karimnagar - Apr 28, 2020 , 02:55:55

తెలంగాణ దేశానికే దిక్సూచి

తెలంగాణ దేశానికే దిక్సూచి

  • ఉద్యమపార్టీ పాలనవల్లే రాష్ట్రంలో అభివృద్ధి
  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెగడపల్లి : తెలంగాణ దేశానికే దిక్సూచి అని, ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వల్లే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెగడపల్లిలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి మంత్రి ఈశ్వర్‌ గులాబీ జెండాను ఆవిష్కరించి, కేక్‌ కట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని సందర్శించి రక్త దాతలకు పండ్లు, జ్యూస్‌లను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆవరణలో ఎంఎల్‌ కొప్పుల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన, పారిశుధ్య కార్మికులు మొత్తం 336 మందికి నిత్యావసరాలను అందజేశారు. మండలంలోని 37 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు 37 లక్షల 592 విలువ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గోళి శోభ, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు, విండో చైర్మన్లు వోరుగంటి రమణారావు, కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వేణుగోపాల్‌, వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, డీఎస్పీ వెంకటరమణ, సర్పంచ్‌ శ్రీనివాస్‌, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ కాలువల పూడికతీత పనులపై సమీక్ష

ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఎస్సారెస్పీ కాలువల పూడికతీత పనులు చేపట్టాలని మంత్రి ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల, ఈజీఎస్‌ అధికారులు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా కాలువ పూడిక తీత పనులు గుర్తించి, ఉపాధి పథకం కింద మే 14 నుంచి 28 దాకా చేయాలన్నారు.  లష్కర్ల కొరత తీవ్రంగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తేగా పరిష్కరిస్తానన్నారు. ఎస్సారెస్పీ ఎస్‌ఈ శివకుమార్‌, ఈఈ శ్రీనివాస్‌, డీఈఈలు మధుసూదన్‌రెడ్డి, షుక్రునాయక్‌, ప్రసాద్‌, ఉపాధి హామీ ఏపీడీ లక్ష్మీనారాయణ, డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo