బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Apr 28, 2020 , 02:55:24

మిగిలింది ఒక్కరే..

మిగిలింది ఒక్కరే..

  • డిశ్చార్జ్‌ అయిన మరో కరోనా బాధితుడు  
  • కరీం‘నగరం’లో కట్టుదిట్టంగా నివారణ చర్యలు
  • కొత్తగా పోలీసుల చేతికి పల్స్‌ ఆక్సీమీటర్లు 

కరీంనగర్‌ హెల్త్‌/ కరీంనగర్‌ క్రైం : జిల్లాలో కరోనా బాధితులు ఒక్కొక్కరుగా కోలుకుంటున్నారు. జిల్లాకు చెందిన 19 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఇప్పటికే 17 మంది విడతలవారీగా డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు తాజాగా ఇంటికి రాగా, ఇక ఒక్కరే మిగిలారు. ఈ నెల 2 నుంచి హైదరాబాద్‌లోని కింగ్‌ కోటిలో చికిత్స పొందుతున్న జిల్లాకు చెందిన వ్యక్తి 24 రోజుల తర్వాత కోలుకుని సోమవారం డిశ్చార్జ్‌ అయినట్లు డీఎంఅండ్‌హెచ్‌వో జీ సుజాత తెలిపారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ఇతడికి చికిత్స తర్వాత కరోనా నెగెటివ్‌ వచ్చినప్పటికీ హోం క్వారంటైన్‌లో ఉంచుతామని, ప్రతి రోజూ వైద్య సిబ్బంది ఇతడి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని ఆమె తెలిపారు. కాగా, కరోనా సోకిన ఇంకా ఒక్కరు మాత్రమే హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు.

ఇకనుంచి పల్స్‌ ఆక్సీమీటర్ల వినియోగం..

కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసులు కరోనా కట్టడికి పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నివారణ చర్యల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు థర్మల్‌ స్కానర్లతో స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేసిన పోలీసులు, తాజాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సహకారంతో పల్స్‌ఆక్సీమీటర్ల వినియోగిస్తున్నారు. సోమవారం ఇందిరాచౌక్‌ వద్ద ఈ కార్యక్రమాన్ని సీపీ కమలాసన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. అలాగే, రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు బిస్కెట్లను అందజేశారు.logo