సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Apr 26, 2020 , 03:16:15

త్వరలోనే ప్రతిరోజూ నీటి సరఫరా

త్వరలోనే ప్రతిరోజూ నీటి సరఫరా

  • వారంలోగా ట్రయల్న్‌ 
  • మంత్రి గంగుల కమలాకర్‌
  • 36ఎంఎల్‌డీ ఫిల్టర్‌బెడ్‌ పరిశీలన
  • టూ వీలర్స్‌ మెకానిక్‌లకు నిత్యావసరాల పంపిణీ, అన్నదానం


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో త్వరలోనే ప్రతిరోజూ మంచినీటిని సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శనివారం ఆయన మానేరు డ్యాం సమీపంలో నూతనంగా నిర్మించిన 36 ఎంఎల్‌డీ ఫిల్టర్‌బెడ్‌ను మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ, మిషన్‌ అర్బన్‌ భగీరథ పను లు తుది దశకు వచ్చాయని పేర్కొన్నారు. నగరంలో 110 కోట్లతో భగీరథ కింద పనులు చేపట్టామని వివరించారు. ప్రతిరోజూ నీటి సరఫరా కోసం ఎల్‌ఎండీలో 10 టీఎంసీల నీరు ఉం డేలా చూస్తున్నామని చెప్పారు. వారంలోగా ట్రయల్‌ రన్‌ ప్రారంభిస్తామని, విజయవంతమైన వెంటనే 24 గంటలు నీటి సరఫరా చేపట్టేందుకు వేగంగా పనులు చేపడుతామన్నారు.  

పేదలను ఆదుకుంటాం.. 

లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడుతున్న పేదలు, కూలీలు, కులవృత్తిదారులను ఆదుకుంటామని మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. స్థానిక టెలిఫోన్‌ క్వార్టర్స్‌ వద్ద టూ వీలర్‌ మెకానిక్‌లకు నిత్యావసరాల పంపిణీతోపాటు అన్నదానం చేయగా, మంత్రి పాల్గొన్నారు. తోడేటి బాబు సహకారంతో 200 మంది మెకానిక్స్‌కు సరుకులు అందించామన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, బల్దియా కమిషనర్‌ క్రాంతి, తదితరులున్నారు. 


logo