సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Apr 21, 2020 , 03:02:42

నియంత్రణకు సహకరించాలి

నియంత్రణకు సహకరించాలి

  • ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలి
  • మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 
  • ఖనిలో పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ

గోదావరిఖని టౌన్‌: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండాలని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పిలుపునిచ్చారు. మంత్రి జన్మదినోత్సవం సందర్భంగా ఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందర్‌ నిర్వహించిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి హాజరై, మాట్లాడారు. ప్రజల క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని, కేంద్రం కంటే రెండు రోజుల ముందుగానే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారని, మరికొంత కాలం ఇలాగే సహకరిస్తే మహమ్మారి పూర్తిగా అంతమవుతుందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే చందర్‌తో కలిసి పాత్రికేయులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, మేయర్‌ అనిల్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌ రావు పాల్గొనగా, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సౌజన్యంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 


logo