శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Apr 03, 2020 , 01:41:53

కల్యాణం.. నిరాడంబరం

కల్యాణం.. నిరాడంబరం

సిరిసిల్ల జిల్లాలో..

వేములవాడ కల్చరల్‌/ బోయినపల్లి/ గంభీరావుపేట/రుద్రంగి/సిరిసిల్ల కల్చరల్‌/ ముస్తాబాద్‌/చందుర్తి/కోనరావుపేట :  దక్షిణకాశీగా బాసిల్లుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు గురువారం నిరాడంబరంగా నిర్వహించారు. కన్యాదాతలుగా మరంగంటి విజయసారథి దంపతులు వ్యవహరించగా, వేద మంత్రోచ్ఛారణల నడుమ వివాహ ఘట్టాన్ని కనులపండువలా జరిపారు. వేములవాడ మున్సిపల్‌ తరఫున అధ్యక్షురాలు రామతీర్థపు మాధవిరాజు, వైస్‌చైర్మన్‌ మధు రాజేందర్‌, కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. ఆలయం ఎదుట కొందరు శివపార్వతులు తలువాలు పోసుకున్నారు. రాజన్న అనుబంధ ఆలయమైన కోనరావుపేట మండలం మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంతోపాటు రేపాక, రామోజీపేట గ్రామాల్లోని సీతారామాలయంలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ముస్తాబాద్‌ మండలం పోతుగల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ శరత్‌రావు, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, సర్పంచ్‌ తన్నీరు గౌతంరావు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లాలో.. 

జగిత్యాల/ధర్మపురి,నమస్తేతెలంగాణ/మల్యాల/మారుతీనగర్‌ : ధర్మపురి ఉగ్ర నరసింహుడి ఆలయ ప్రాంగణంలో కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థాన ఆలయ ప్రాకార మండపంలో రాముడు, సీతాదేవి ఉత్సవ మూర్తులకు తిరుమంజనం, నూతన వస్ర్తాలంకరణ చేసి, అర్థ మండప వేదికపై కల్యాణ తంతు నిర్వహించారు. స్థానాచార్యులు జితేంద్ర ప్రసాద్‌, ప్రధానార్చకుడు రామకృష్ణ, ఉప ప్రధానార్చకుడు చిరంజీవి, అర్చకులు కపిలేందర్‌, అఖిల్‌, వేద పండితుడు పెద్దన్న శర్మ, ఏఈవో బుద్ధి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. మెట్‌పల్లి కోదండ రామాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సరోజన దంపతులు పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ ఆలయంలో అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం దంపతులు, జగిత్యాల మున్సిపల్‌ అధ్యక్షురాలు బోగ శ్రావణి దంపతులు పూజలు చేశారు.  

కరీంనగర్‌ జిల్లాలో..

ఇల్లందకుంట/ చొప్పదండి/ కార్పొరేషన్‌/ రామడుగు/ హుజూరాబాద్‌టౌన్‌/ జమ్మికుంట/ గన్నేరువరం/ కరీంనగర్‌రూరల్‌ : అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రాములోరి కల్యాణ వేడుక వైభవంగా జ రిగింది. జడ్పీ అధ్యక్షురాలు విజయ, ఆలయ ఈ వో సుధాకర్‌, పట్టు వస్ర్తాలు సమర్పించారు. అనంతరం అర్చకులు రామాచార్యులు, సీతారామాచార్యులు, వంశీధరాచార్యులు, నవీన్‌శర్మ, లోకాచార్యులు సీతారాముల కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కరీంనగర్‌లోని రాంనగర్‌లో గల శ్రీ రమాసహిత సత్యనారాయణస్వా మి, అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన కల్యాణానికి డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ పట్టువస్ర్తాలు సమర్పించారు. గోపాల్‌రావుపేట సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ హాజరయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మితో కలిసి చొప్పదండి రామాలయంలో పూజలు చేశారు. వెలిచాల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సర్పంచ్‌ వీ ర్ల సరోజన, ప్రభాకర్‌రావు దంపతులు కల్యాణం జరిపించారు. హుజూరాబాద్‌ పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్‌తో పాటు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు గందె రాధిక-శ్రీనివాస్‌, జమ్మికుంట రైల్వేస్టేషన్‌ ఆవరణలోని రామాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు దంపతులు హాజరయ్యారు. గన్నేరువరం మండలం మాదాపూర్‌ సీతారాముల ఆలయంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్తపలి శివాలయంలోని సీతారామాంజనేయ సహిత సాయిబాబా ఆలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, వైస్‌ చైర్మన్‌ బండ రాధ గోపాల్‌రెడ్డి కల్యాణం జరిపించారు.

పెద్దపల్లి జిల్లాలో..

రాంమందిర్‌ఏరియా/ పెద్దపల్లిరూరల్‌/ ఓదె ల/ కాల్వశ్రీరాంపూర్‌/యైటింక్లయిన్‌ కాలనీ: గోదావరిఖని కోదండ రామాలయంలో అర్చకుడు మధుసూధనాచారి ఆధ్వర్యంలో, జిల్లాకేంద్రంలోని కోదండ రామాలయంలో పూజారులు కొండపాక శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం నిర్వహించారు. ఓదెల మల్లన్న ఆలయంలో వేదపండితులు ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, దూపం వీరభద్రయ్య, భవానీప్రసాద్‌ జరిపారు. జూనియర్‌ అసిస్టెంట్‌ కుమారస్వామి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కాల్వశ్రీరాంపూర్‌ జగత్‌ మహామునీశ్వరస్వా మి ఆలయంతోపాటు మంథని గోదావరి తీరంలో ని రామాలయం, యైటింక్లయిన్‌ కాలనీలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో కల్యాణ తంతును నిర్వహించారు. ఆర్జీ-2 సివిల్‌ డీజీఎం రామకృష్ణ పాల్గొని స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.


logo