శనివారం 06 జూన్ 2020
Karimnagar - Mar 31, 2020 , 02:53:33

కట్టడి చర్యల్లో దేశానికే ఆదర్శం

కట్టడి చర్యల్లో దేశానికే ఆదర్శం

జగిత్యాల, నమస్తే తెలంగాణ/ కోరుట్లటౌన్‌/ గొల్లపల్లి/పెగడపల్లి : ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. వైరస్‌ నియంత్రణ చర్యలపై సోమవారం ఆయన కోరుట్ల మున్సిపల్‌ కార్యాలయం, గొల్లపల్లి, పెగడపల్లి మండల కేంద్రాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఐసోలేషన్‌ వా ర్డు ను పరిశీలించారు. ముందుగా కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ అధ్యక్షురా లు దావ వసంత, కలెక్టర్‌ రవితో కలిసి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ముందస్తు ప్రణాళికలు, మార్గదర్శకాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించా రు. కరోనా వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్ర చారం చేస్తున్న వ్యక్తులపై కే సులు నమోదు చేయాలని పేర్కొన్నారు. సామాజిక దూరం పాటించడం ద్వా రా వైరస్‌ను అరికట్టవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఐసీయూ ఏ ర్పాటు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. నిత్యావసర సరుకులకు కొరత రానివ్వబోమని చె ప్పారు. వలస కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని, రోజూ రెండు పూటలా భోజన వసతి కల్పిస్తామని భరోసానిచ్చారు. వలస కూలీలు, నిరాశ్రయులకు సరుకు ల పంపిణీ కోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు సహకరిస్తున్న పోలీస్‌, మున్సిపల్‌, వైద్య సిబ్బంది, మీడి యా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ కరోనా అనుమానంతో 22 మందిని గాంధీ వైద్యశాలకు పంపగా వారిలో 20 మందికి నెగెటివ్‌ వచ్చిందని, మరో రెండు రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జి ల్లాలో ఈరోజు వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కే సు కూడా నమోదు కాలేదని తెలిపారు. జగిత్యాల ప్రధాన వైద్యశాలలో 40, కొండగట్టు జేఎన్టీయూలో 40, డయాగ్నస్టిక్‌ వైద్యశాలలో 10 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. గొల్లపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో మం త్రి మాట్లాడుతూ, సంచార జాతులవారికి నిత్యావసరాలు ఇచ్చేలా స్వచ్ఛంద సంస్థలను, ప్రజాప్రతినిధులను, వర్తక వ్యాపారులను ప్రోత్సహించాలన్నారు. పెగడపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో మాట్లాడుతూ, యాసంగి పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుం డా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు సం యమనం పాటించాలని సూచించారు.  ఆయాచోట్ల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, ఆదనపు కలెక్టర్‌ రాజేశం, డీఆర్వో అరుణశ్రీ, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపల్‌ అధ్యక్షులు అన్నం లావణ్య, సుజాత, ఉపాధ్యక్షుడు గడ్డమీది పవన్‌, కమిషన ర్లు మహ్మద్‌ అయాజ్‌, జగదీశ్వర్‌గౌడ్‌, డీఎస్పీ గౌస్‌బాబా, తాసిల్దార్లు నవీన్‌ కుమార్‌, రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవోలు నవీన్‌ కుమార్‌, వెంకటేశం, ఎంపీవో సలీమ్‌, ఎంపీపీలు గోళి శోభ, నక్క శంకరయ్య, ఆవుల సత్తయ్య, జడ్పీటీసీలు జలందర్‌, రాజేందర్‌రావు, వైస్‌ ఎంపీపీలు సత్తయ్య, గంగాధర్‌, వైద్యులు సుధాకర్‌, లవకుమా ర్‌, సీఐ కిశోర్‌, ఎస్‌ఐలు చిరంజీవి, నవత తదితరులు పాల్గొన్నారు.  


logo