శనివారం 30 మే 2020
Karimnagar - Mar 31, 2020 , 02:50:48

మటన్‌, చేపల విక్రయాలు చేపట్టాలి

మటన్‌, చేపల విక్రయాలు చేపట్టాలి

జగిత్యాల, నమస్తే తెలంగాణ : జగిత్యాల జిల్లాకేంద్రంలోని విద్యానగర్‌ రైతుబజార్‌లో కూరగాయలతో పాటు మటన్‌, చేపల విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ సూచించారు. రైతుబజార్‌ను ము న్సిపల్‌ సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. మార్కెట్‌కు ఉన్న రెండు గేట్ల ద్వారా రాకపోకలు సాగించాలని, రద్దీ ఉండకుండా సామాజిక దూరాన్ని బాధ్యతగా పాటించాలని కోరారు. ఆయనవెంట మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు చుక్క నవీన్‌, నాయకులు బోగ ప్రవీణ్‌, బండారి నరేందర్‌, కూతురు శేఖర్‌ ఉన్నారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ వద్ద ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. క్వారంటైన్‌లో ఉన్న పలువురితో మాట్లాడి మనోధైర్యాన్నిచ్చారు. పలువురు ఇటీవల కరీంనగర్‌ రెడ్‌జోన్‌ నుంచి రాగా, అధికారులు వారిని జేఎన్టీయూ ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇక్కడ హిమ్మత్‌రావుపేట సర్పంచ్‌ కృష్ణారావు తదితరులున్నారు. ధరూర్‌ చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ తీరును ఎమ్మెల్యే పరిశీలించి ఒకే బైక్‌పై నలుగురు రావడాన్ని గమనించి, వారిని ఆపి దండం పెట్టి వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. నెలల వయస్సున్న పాప, బాబుతో కలిసి బైక్‌పై ప్రయాణించడం సరికాదన్నారు.


logo