ఆదివారం 24 మే 2020
Karimnagar - Mar 20, 2020 , 02:21:50

తొలిరోజు సజావుగా

తొలిరోజు సజావుగా

  • మొదలైన పది పరీక్షలు
  • హాజరైన విద్యార్థులు 14078
  • 99.78 శాతం హాజరు

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జిల్లా వ్యాప్తం గా మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు తీసుకున్న చర్యలు ఫలప్రదమ య్యాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ప్రథమ భాష-1 పేపర్‌కు 14106 మంది విద్యార్థులకు గాను 14078 మంది విద్యార్థులు హాజరయ్యారు. 99.78శాతం మంది విద్యార్థులు, 70 పరీక్ష కేంద్రాల్లో  పరీక్షలు రాశారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వీ  దుర్గాప్రసాద్‌ తెలిపారు.  కాగా 70 మంది సిట్టింగ్‌ స్కాడ్స్‌, ఐ దు ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ బృందాలు, డీఈఓతో సహా, రాష్ట్రస్థాయి పరిశీలకులు కలిసి మొత్తం 42 పరీక్ష కేంద్రాలను సందర్శిం చారు.  గురువారం జరిగిన పరీక్షలో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ కేసులు లేవని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించినట్లు  డీఈఓ దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు.

 మాస్క్‌లతో పరీక్ష కేంద్రాలకు.. 

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో గురువారం జరిగిన ప్రథమభాష పరీక్షకు కరీంనగరంలోని పలు పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు మాస్క్‌లు ధరించి వచ్చారు.    కేంద్రాల వద్ద ముం దుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బందిని నియమించారు. విద్యార్థులకు శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లను సైతం అందుబాటులో ఉంచారు.

పరీక్ష కేంద్రంలో ఒకే ఒక్కడు..

హుజూరాబాద్‌టౌన్‌: పట్టణంలోని న్యూ శాతవాహన ఇం గ్లిష్‌ మీడియం పాఠశాల (ప్రైవేట్‌ సెంటర్‌)లో ఒకే ఒక్క వి ద్యార్థి పదో తరగతి పరీక్ష రాశాడు. కాగా ఎనిమిది మంది సిబ్బంది విధులు నిర్వర్తించడం గమనార్హం.  ఇల్లదకుంట మండలం మర్రిపల్లిగూడెంకు చెందిన కోడం శ్రీకాంత్‌  గతేడాది నిర్వ హించిన పదో తరగతి పరీక్షల్లో తెలుగులో  ఫెయిలయ్యాడు. కాగా ఈ యేడు పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించాడు. కాగా ప్రై వేట్‌ పరీక్ష సెంటర్లు జిల్లా కేంద్రంలో ఒకటి, హుజూరాబాద్‌ లో మరొకటి  ఏర్పాటు చేశారు.  సదరు విద్యార్థికి  న్యూ శా తవాహన పాఠశాలను కేటాయించారు. దీంతో అత డు మొదటి రోజు, రెండో రోజు కూడా తెలుగు  పరీక్ష  రాయనున్నాడు. అతడిని పర్యవేక్షించేందుకు సిట్టింగ్‌ స్వా డ్‌, చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌(డీవో), ఇ న్విజిలేటర్‌, బందోబస్తు కోసం పోలీస్‌ కానిస్టేబుల్‌, మెడికల్‌ సిబ్బంది, క్లర్క్‌, అటెండర్‌ ఇలా ఎనిమిది మంది ఉద్యోగులు ఒక్కడి కోసం విధులు నిర్వహించాల్సి వచ్చింది. అయితే తెలుగు, సో షల్‌ పేపర్లకు ఒక్కొక్కరు చొప్పున పరీక్ష రాయనుండగా మ్యాథ్స్‌కు ఇద్దరు, సైన్స్‌పరీక్షకు పదమూడు మంది రాయనున్నారని  సీఎస్‌ హఫ్రీజ్‌ ఖురేషీ, డీవో విష్ణుకుమార్‌ తెలిపారు.   


logo