శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Mar 17, 2020 , 02:38:10

అసెంబ్లీ తీర్మానంపై హర్షం

అసెంబ్లీ తీర్మానంపై హర్షం
  • సీఏఏకు వ్యతిరేకమని ఆమోదించడంపై మైనార్టీల సంబురాలు
  • కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం
  • పటాకలు కాల్చి, స్వీట్లు పంచిపెట్టిన నాయకులు

తెలంగాణ చౌక్‌: రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సోమవారం పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంపై మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్‌ మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్‌, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ ఫక్రొద్దీన్‌ ఆధ్యర్యంలో తెలంగాణచౌక్‌లో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకలు కాల్చారు. ప్రయాణికులకు, వాహనదారులకు స్వీట్లు పంచారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించడానికే కేంద్రం మతపరమైన చట్టాలను తీసుకువస్తున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయన్నారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు యూసుఫ్‌హుస్సేన్‌, షాహిన్‌అలీ, నవాజ్‌హుస్సేన్‌, సయ్యద్‌ వాజిద్‌, సయ్యద్‌, ముజీబ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు జీఎస్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo