శనివారం 06 జూన్ 2020
Karimnagar - Mar 16, 2020 , 03:09:05

మమ్మేలు.. మల్లన్నా

మమ్మేలు.. మల్లన్నా
  • బోనమెత్తిన పెద్దాపూర్‌
  • వైభవంగా మల్లికార్జునస్వామి జాతర
  • 60వేల బోనాలతో మొక్కుల చెల్లింపు
  • పట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల దంపతులు

మారుతీనగర్‌ : శివసత్తుల పూనకాలు.. పోతరాజుల ప్రదర్శనల మధ్య 60వేల బోనాల సమర్పణతో మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ మల్లికార్జునస్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా కాముని (ఫాల్గుణ) పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కాగా శనివారం రాత్రి స్వామివారికి ఎమ్మెల్యే కల్వకుం ట్ల విద్యాసాగర్‌రావు, సరోజ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. యాదవుల ఆరాధ్య దైవమైన మల్లన్న బోనాల జాతర సందర్భంగా ఆదివారం తెలంగాణ నుంచే కాకుం డా మహారాష్ట్రలోని ముంబాయి, జాల్నా, కర్ణాట క రాష్ట్రం నుంచీ వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుం చే మహిళలు భక్తిశ్రద్ధలతో నైవేద్యం వండి బోనాలను సిద్ధం చేసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి సమర్పించారు. వేలాది మంది ఒకేసారి బోనాలతో రావడంతో ఆలయ ప్రాంగ ణం కిక్కిరిసిపోయింది. భక్తులు గొర్రె పిల్లలను స్వామివారికి సమర్పించి తమ పిల్లాపాపలను, గొడ్డూగోదను, పాడిపంటలను సల్లంగ చూడాలని వేడుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరం సైతం నెలకొల్పారు.

పలువురు ముస్లింలు జాతరకు వచ్చిన భక్తులకు మం చినీటినందించి మత సామరస్యాన్ని చాటారు. సాయంత్రం మల్లన్న ఉత్సవమూర్తితో రథోత్సవాన్ని కనులపండువలా నిర్వహించారు. కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు ఆధ్వర్యంలో పకడ్బందీ బం దోబస్తు కల్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కా టిపెల్లి రాధ, శ్రీనివాస్‌రెడ్డి దంపతులు, సర్పంచ్‌ కోరెపు రవి, ఉపసర్పంచ్‌ పోతుగంటి గంగాధర్‌, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మెరుగు దశగౌడ్‌, ఉపాధ్యక్షుడు చేపూరి రాజరెడ్డి, ఎంపీటీసీ తేలుకంటి శంకరయ్య, నాయకులు చేపూరి జీవన్‌రెడ్డి, దోతుల రమేశ్‌, తేలకంటి లక్ష్మి, సామ శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, రాజరెడ్డి, లింగారెడ్డి, స్వామి, ప్రసాద్‌, గ్రామాభివృద్ధి కమిటీ, యూత్‌ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo