ఆదివారం 07 జూన్ 2020
Karimnagar - Mar 08, 2020 , 01:51:50

అలరించిన ‘అల్ఫోర్స్‌ తరంగ్‌-2020’

అలరించిన ‘అల్ఫోర్స్‌ తరంగ్‌-2020’

హౌసింగ్‌బోర్డుకాలనీ: స్థానిక వావిలాలపల్లి అల్ఫోర్స్‌ టైనీటాట్స్‌లో శనివారం  ‘అల్ఫోర్స్‌ తరంగ్‌-2020’ పేరిట నిర్వహించిన వార్షిక వేడుకలు అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు, కవి, రచయిత, ప్రముఖ పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ ఎడవల్లి విజయేందర్‌రెడ్డి హాజరై, అల్ఫోర్స్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డితో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి, మాట్లాడారు. నిత్యజీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు సాంస్కృతిక కార్యాక్రమాలు దోహదపడుతాయని తెలిపారు. అల్ఫోర్స్‌ చైర్మన్‌ వీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ,  విద్యార్థులందరూ వినోదభరితమైన కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలని కోరారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్స్‌, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


logo