సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Mar 08, 2020 , 01:50:54

అట్టహాసంగా ‘అపూర్వ వావ్‌ ఫెస్ట్‌'

అట్టహాసంగా ‘అపూర్వ వావ్‌ ఫెస్ట్‌'

కరీంనగర్‌ రూరల్‌: అపూర్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ‘అపూర్వ వావ్‌ ఫెస్ట్‌-2020’ కార్యక్రమాన్ని అట్టహాసంగా  నిర్వహించారు. నగర మేయర్‌ సునీల్‌రావు హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేయర్‌ మాట్లాడుతూ,  నేటి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థినులు అన్ని రంగాలపైనా దృష్టిసారించాలనీ, కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని, తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విశిష్ట అతిథి సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, అణుశక్తి, విద్యుత్‌ శక్తి కంటే మహిళాశక్తి గొప్పదని పేర్కొన్నారు. విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి, శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్‌ సూరెపల్లి సూజత, కళాశాల చైర్మన్‌ పీ వేణు, కార్పొరేటర్లు గుగ్గిళ జయశ్రీ, చొప్పరి జయశ్రీ, గందె మాధవి, వాణి, డాక్టర్‌ అనిత కళాశాల డైరెక్టర్‌ హలీం పాల్గొన్నారు. logo