శనివారం 30 మే 2020
Karimnagar - Mar 06, 2020 , 02:10:13

నీటి సమస్యల్లేకుండా చూడాలి

 నీటి సమస్యల్లేకుండా చూడాలి

చొప్పదండి, నమస్తే తెలంగాణ: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సాగు, తాగునీటి సమస్యల్లేకుండా ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదేశించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆరు మండలాల ఇరిగేషన్‌ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో నిర్మించనున్న మోతెవాగు ప్రాజెక్ట్‌కు రూ. 271 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్లు సైతం పూర్తయ్యాయని, అగ్రిమెంట్‌ను తొందరగా చేయించాలని ఆదేశించారు. గాయత్రి పంపుహౌస్‌ నుంచి  గుమ్లాపూర్‌, కాట్నపల్లి, మంగళపల్లి ఇతర గ్రామాల చెరువులను నింపేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. సూపర్‌ప్యాకేజీద్వారా రామడుగు, రాంచంద్రాపూర్‌, దత్తోజిపేట, వెంకట్రావుపల్లె గ్రామాల్లో చెరువులు నింపేందుకు కృషిచేయాలన్నారు. నియోజకవర్గంలోని రామడుగులో 6, కొడిమ్యాలలో 17, మల్యాలలో 2, చొప్పదండిలో 2 చెక్‌డ్యాంలు మంజూరయ్యాయని, వాటి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ ద్వారా వస్తున్న నీటిని రైతులకు పూర్తిస్థాయిలో అందించేలా పనిచేయాలన్నారు. ఈ  సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆరుమండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇరిగేషన్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.logo