ఆదివారం 31 మే 2020
Karimnagar - Mar 05, 2020 , 02:20:27

మొదటి రోజు ప్రశాంతం

 మొదటి రోజు ప్రశాంతం

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ ప్రథమ పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ద్వితీయ భాష పరీక్ష నిర్వహించగా, సెట్‌ ఏ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని ఓపెన్‌ చేశారు. జనరల్‌ విభాగం నుండి 16,328 మంది విద్యార్థులకు 15,883 హాజరు కాగా, 445 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగం నుండి 2100 మంది విద్యార్థులకు 1878 మంది హాజరు కాగా, 222 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రాజ్యలక్ష్మి తెలిపారు. కాగా, మానకొండూర్‌ మండలం ఊటూర్‌ గ్రామానికి చెందిన శారద ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల విద్యార్థి దావర్ల అనిల్‌ పరీక్ష కేంద్రానికి అరగంట ఆలస్యంగా చేరుకోవడంతో సిబ్బంది లోపలికి అనుమంతించలేదు. దీంతో పరీక్ష రాయకుండానే వెళ్లిపోయాడు.logo