శనివారం 30 మే 2020
Karimnagar - Mar 02, 2020 , 02:38:24

పరిశుభ్రతే లక్ష్యంగా..

పరిశుభ్రతే లక్ష్యంగా..

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ:జిల్లాలో పట్టణ ప్రగతి ఏడో రోజూ జోరుగా హుషారుగా సాగుతు న్నది.. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో వాడవాడ ల పర్యటించారు. పారిశుధ్య పనులను చేపట్టారు.   వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు.చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వా ర్డులోఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ పాదయాత్ర నిర్వహించారు.  రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంట్‌ స్తంభాలను తొల గించాలని అధికారులను ఆదేశించారు. ఇం టింటా ఇంకుడుగుంత నిర్మించుకోవాలని  ప్రజలకు సూచించారు. పరిసరాల  పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీల వాహనాలకు అందజేయా లని సూచించారు.  హుజూరాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు  పర్యటించి పనులను  పర్యవేక్షించారు. మొ క్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలు పునిచ్చారు. హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల అధినేతలు గందె రాధిక, తక్కళ్లపల్లి  రా జేశ్వర్‌రావు పనులను పర్యవేక్షించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో 59, 60 డివిజన్లల్లో మేయర్‌ వై సునీల్‌రావు పర్యటించారు. నగరంలోని అన్ని డివిజన్లల్లోనూ ప్రస్తుతం ఖాళీ స్థలా ల్లో పేరుకపోయిన చెత్తను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందు కోసం పెద్ద సం ఖ్యలో ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు.  అలాగే ఆయా మున్సిపాలిటీల పరిధిలోని అ క్రమ లేఅవుట్లను గుర్తించే పని లో అధికారులు నిమగ్నమయ్యా రు. అన్ని మున్సిపాలిటీల్లో ఖాళీ స్థలాల శుభ్రతపై దృష్టి పెట్టారు.  ఇప్పటికే ఆయా   స్థలాల యజమానులకు నోటీసులు అందించిన అధికారులు ఇప్పుడు వాటిని శుభ్రంచేసే పనులు సాగిస్తున్నారు. వీటితో పాటు గా మురికికాల్వల్లో పేరుకపోయిన సీల్ట్‌ను తొలగించి తక్షణమే దానిని డంపింగ్‌ యార్డులకు తరలించే విషయంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు.  ఈ దిశగా సిబందిని సమయాత్తం చేస్తున్నారు. ఆయాచోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీల సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 


logo