శనివారం 30 మే 2020
Karimnagar - Mar 02, 2020 , 02:08:58

వీధుల్లో పర్యటనలు..అభివృద్ధి పనులు

వీధుల్లో పర్యటనలు..అభివృద్ధి పనులు

హుజూరాబాద్‌టౌన్‌: ఏడో రోజైనా ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమం వాడవాడలా ఉత్సాహంగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పలు వార్డుల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక శ్రీనివాస్‌ పలు వార్డుల్లో పర్యటించారు. పనులతీరును అడిగి తెలుసుకున్నారు. పట్టణ సమగ్రాభివృద్ధికే ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి అంకురార్ఫణ చేసిందని పేర్కొన్నారు.   23వ వార్డులో కౌన్సిలర్‌ మొలుగు సృజన పూర్ణచందర్‌ ఆధ్వర్యంలో బుడగజంగాలకాలనీలో ఎస్పారెస్పీ పక్క కాలువలో ఉన్న చెట్లను తొలగించి కట్టను వేయించారు. బురద ఉన్న ప్రాంతంలో మొరం పోసి శుభ్రం చేశారు.   ఉన్న చెత్తా చెదారం, ముళ్ల చెట్లను తొలగించారు.  ఎస్సీ హాస్టల్‌ను తనిఖీ చేసి విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. 13వ వార్డు  సిక్కులవాడలో మురుగు కాలువల్లో సీల్ట్‌ తొలగింపు పనులను చైర్‌పర్సన్‌ పర్య వేక్షించారు. 1వ వార్డులో కౌన్సిలర్‌ భాషబోయిన వనిత కుమార్‌ ఆధ్వర్యంలో ప్రధాన రహదారి వెంట ఉన్న బురద గుంటలకు కందకం కొట్టి,  మురుగు కాలువలను శుభ్రం చేయించారు. 2వ వార్డులో ఖాళీస్థలంలో చెత్తను, ముళ్ల చెట్లను ఎక్స్‌కవేటర్‌తో తొలగింపజేసిన కౌన్సిలర్‌ యాదగిరినాయక్‌, ప్రత్యేకాధికారి, కమిటీ సభ్యులు. 12వ వార్డులోని బీసీకాలనీలో చెత్తకుప్పలను తొలగించి అక్కడ  ముగ్గువేసి చెత్త వేయరాదని స్థానిక కౌన్సిలర్‌ తొగరు సదానందం, ప్రత్యేకాధికారి రాజారాంమ్మోహన్‌రాయ్‌ స్థానికులకు సూచించారు. 7వ వార్డు పరిధిలోని బండఅంకూస్‌వాడలో వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల-శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సిబ్బందితో మురుగు కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు. 16 వ వార్డు పరిధిలోని హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారులకు ఇ రువైపులా ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయిం చి, అంతర్గత రోడ్లపక్కన పెరిగిన ముళ్ల పొదలను తొలగించి ట్రాక్టర్‌లో తరలించారు. పనులను కౌన్సిలరు మారపల్లి సుశీల, ప్రతేకాధికారి, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ఇక్కడ వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల శ్రీనివాస్‌, మేనేజర్‌ రాజారామ్మోహన్‌రాయ్‌ ఉన్నారు.

జమ్మికుంటలో జోరుగా..హుషారుగా..

జమ్మికుంట రూరల్‌:  పట్టణ ప్రగతి కార్యక్రమం జమ్మికుంటలో జోరుగా హుషారుగా కొనసాగుతున్నది.  మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు  1, 2, 18, 19, 21 వార్డులలో పర్యటించి ప్రజతో కలసి శ్రమదా నం చేశారు. అనంతరం వారి సమస్యలను తెలుకున్నా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ ప్రగతి ద్వారా ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా ప్రజలకు బట్టసంచులను పంపిణీ చేశారు.  ఇక్కడ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వాడకంతో అనేక అనర్థాలు కలుగుతాయనీ, నిషేధానికి సహకరించాలని కోరారు.  ఆయా కార్యక్రమాల్లో  వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న, స్థానిక కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎలగంధుల స్వరూప, దేశిని రాధ, బొద్దుల అరుణ, మారపల్లి భిక్షపతి, తాసిల్దార్‌ నారాయణ, ఈవోపీఆర్టీ రాజేశ్వర్‌రావు  తదితరులు ఉన్నారు. 


logo