గురువారం 04 జూన్ 2020
Karimnagar - Mar 01, 2020 , 02:21:15

అల్ఫోర్స్‌ గ్లోరి -2020 అదుర్స్‌

 అల్ఫోర్స్‌ గ్లోరి -2020 అదుర్స్‌

కరీంనగర్‌ రూరల్‌: రేకుర్తిలోని ఒక ప్రైవేట్‌ హాల్‌లో శనివారం నిర్వహించిన అల్ఫోర్స్‌ పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ‘అల్ఫోర్స్‌ గ్లోరి-2020’ ఆకట్టుకుంది. ఆ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు. చిన్ననాటి నుంచే లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలనీ, వాటిని సాధించేందుకు కష్టపడాలని సూచించారు. అనంతరం నరేందర్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. విద్యారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.  


logo