శనివారం 30 మే 2020
Karimnagar - Feb 28, 2020 , 02:01:07

పార్టీలకతీతంగా రైతులకు సేవలందించాలి

పార్టీలకతీతంగా రైతులకు సేవలందించాలి

మానకొండూర్‌ రూరల్‌: సహకార సంఘ పాలకవర్గ సభ్యులు పార్టీలకు అతీతంగా రైతులకు సేవలందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కోరారు. మానకొండూర్‌ మండలం దేవంపల్లి సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం  గురువారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా  పాలకవర్గ సభ్యులతో సంఘం కార్యదర్శి మల్లికార్జున రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులకు సేవలందించాలని సూచించారు.  తెలంగాణ సర్కారు సహకార సంఘాలకు, రైతులకు చేయూత అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే నిధుల్లోంచి రూ. 5 లక్షలు గోదాం నిర్మాణానికి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశానికి ముందు ముఖ్య అతిథులకు గ్రామస్తులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, పాలకవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాగా సహకార సంఘం  అధ్యక్షురాలు కసిరెడ్డి లత, ఉపాధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే, సుడా చైర్మన్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్‌, ఎంపీపీ ముద్దసాని సులోచన, వైస్‌ ఎంపీపీ గోపు మధుసూదన్‌రెడ్డి,  సర్పంచ్‌ మాధవరం రమ, ఎంపీటీసీ మాధవరం జానకి, మానకొండూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ నల్ల గోవిందరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ మల్లగల్ల నగేష్‌, నాయకులు కొత్తూరి జగన్‌గౌడ్‌, బోయిని వెంకటేశ్‌, గుర్రం కిరణ్‌గౌడ్‌, రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

మానకొండూర్‌ రూరల్‌: మండల కేంద్రానికి చెందిన తడకపల్లి అంజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని గురువారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పరామర్శించారు. అలాగే ముంజంపల్లి సర్పంచ్‌ రామంచ గోపాల్‌రెడ్డి ఇటీవల కంటి శస్త్ర చికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ను కలిసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌,  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు బ్రహ్మరెడ్డి, బాలెంకి మల్లేశం, తదితరులున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

తిమ్మాపూర్‌, నమస్తే తెలంగాణ: తిమ్మాపూర్‌ మండల కేంద్రానికి చెందిన శేరి మహేశ్‌కు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 15 వేల ఆర్థిక సాయం మంజూరైంది.  ఎల్‌ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ లబ్ధిదారుడికి చెక్కు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన వారు ఆర్థిక సాయం కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, దుండ్ర రాజయ్య యాదవ్‌, ఎడ్ల బుచ్చిరెడ్డి, బాబు, తదితరులున్నారు.logo