శనివారం 30 మే 2020
Karimnagar - Feb 28, 2020 , 01:58:46

సేంద్రియ సాగుపై దృష్టిసారించాలి

సేంద్రియ సాగుపై దృష్టిసారించాలి

చిగురుమామిడి: సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని నాబార్డు చీఫ్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌ రైతులకు సూచించారు.  మండలంలోని గాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని బొల్లొనిపల్లిలో జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సౌజన్యంతో పందిరి కూరగాయల సాగును నాబార్డు అధికారులతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పందిరి కూరగాయాల సాగుతో 50 శాతం దిగుబడి అధికంగా వస్తుందనీ, మార్కెట్‌లో మంచి ధర ఉంటుందన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకుని ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలన్నారు. ఆసక్తి గల రైతులకు సబ్సీడితో పాటు సేంద్రియ పద్ధతిలో మెళకువలు సూచనలు అందించడం జరుగుతుందన్నారు. రైతులు ఆసక్తి చూపితే నాబార్డు ద్వారా మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం పందిరి కూరగాయల సాగు వివరాల సీడీ, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఇక్కడ నాబార్డు జీఎంలు హరీఫ్‌, మిశ్రా, జిల్లా అధికారి అనంత్‌, జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యదర్శి సంపత్‌కుమార్‌, సర్పంచ్‌ వెంకటేశం, రాజమౌళి, తిరుపతి, సుంకె రాజు, అన్నపూర్ణ పాల్గొన్నారు. 

ఏటీఎం కేంద్రం ప్రారంభం 

మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు వద్ద కేడీసీసీబీ ఏటీఎం కేంద్రాన్ని నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌, ఎంపీపీ కొత్త వినీత, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, వైస్‌ చైర్మన్‌ కరివేద మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ లక్ష్మణ్‌, డైరెక్టర్లు అందె స్వామి, ముద్రకోల రాజయ్య, ఉప సర్పంచ్‌ పద్మ, అన్నాడి మల్లికార్జున్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo