బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 28, 2020 , 01:31:48

సత్వర పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’

 సత్వర పరిష్కారానికే ‘పట్టణ ప్రగతి’

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారానికే ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిం దని నగర మేయర్‌ వై.సునీల్‌రావు అన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. నాల్గో రోజైన గురువారం  నగరంలోని 55, 24వ డివిజన్లలో పాదయాత్ర చేశారు. 24వ డివిజన్‌  శివాజీనగర్‌, అంబేద్కర్‌ కాలనీల్లో పర్యటించారు. ఖాళీ స్థలా లు, శిథిలమైన డ్రైనేజీలను పరిశీలించారు.  కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇళ్లపై నుం చి వెళ్లే విద్యుత్‌ తీగల తొలగింపు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ  సందర్భంగా మేయర్‌ మాట్లాడు తూ  శిథిలమైన డ్రైనేజీల మరమ్మతు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని స్పెషల్‌ ఆఫీసర్‌, ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.  సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మం త్రి కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం సమస్యలను సత్వరమే పరి ష్కరిస్తున్నామన్నారు. నీటి సమస్యలు, డ్రైనేజీ, విద్యుత్‌ స్తంభాలు,  తీగల తొలగింపు, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి, ఖాళీ స్థలాల శుద్ధిపై దృష్టి పెట్టామన్నారు. ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తామని, అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేస్తామన్నారు. నగరంలో ప్రతి ఇంట్లో రెండు చొ ప్పున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణ ప్రగతిలో నగరవాసులు పాలుపంచుకోవాలని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పిలుపునిచ్చారు. మేయర్‌తో కలిసి 55 డివిజన్‌లో పర్యటించారు.  కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ కుర్ర తిరుపతి, జితేందర్‌ పాల్గొన్నారు.  

 వాడవాడలా ఉత్సాహంగా..

పట్టణ ప్రగతి  వాడవాడలా ఉత్సహంగా సాగుతుంది.   శిథిలావస్థకు చేరిన మురికికాల్వలు, రోడ్లు, ఇతర వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే ఆయా డివిజన్లల్లో విద్యుత్‌ స్తంభాల మార్పులు, ఇళ్లపై నుంచి ఉన్న విద్యుత్‌ వైర్ల తొలగింపు పనులు వేగంగ సాగుతున్నాయి. నాలుగోవ రోజు  38వ డివిజన్‌లో ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పా ల్గొన్నారు.   53వ డివిజన్‌లో కార్పొరేటర్‌ తుల శ్రీదేవి పాదయాత్ర చేశారు. 35, 22, 18, 59 తదితర డివిజన్లల్లో  కార్పొరేటర్లు, డివిజన్ల ప్రత్యేకాధికారులు పర్యటించారు.  స్థానికులకు పలు సూచనలు చేశారు.


logo