శనివారం 30 మే 2020
Karimnagar - Feb 27, 2020 , 01:13:32

పాదయాత్రలు.. ప్రణాళికలు

పాదయాత్రలు.. ప్రణాళికలు

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన ‘పట్టణ ప్రగతి’ ఉత్సాహంగా సాగుతున్నది. మూడో రోజూ చైతన్యం వెల్లివిరిసింది. బుధవారం కరీంనగర్‌లోని 11, 12, 42వ డివిజన్లలో మేయర్‌ వై సునీల్‌ రా వు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లతో కలిసి మం త్రి గంగుల కమలాకర్‌ పాదయాత్ర నిర్వహించారు. వీధు లు, రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. సమీప ఇండ్లకు వెళ్లి మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా చోట్ల ఉన్న ఇబ్బందులను ప్రజలు కూడా చెప్పుకోవడంతో సానుకూలంగా స్పందించారు. పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. మురుగు కాలువలను శుభ్రం చేయాలనీ, రోడ్లపై చెత్తాచెదారం తొలగించాలనీ, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టణ ప్రగతికి నిధుల కొరత లేదనీ, ఎన్ని నిధులు అవసరమైనా ప్రభుత్వం మం జూరు చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామనీ, స్వచ్ఛందంగా పాల్గొని ఎవరి డివిజన్లు వారు అభివృద్ధి చే సుకోవాలని సూచించారు. పట్టణ ప్రగతిని విశ్వసిస్తున్న ప్రజల ఒత్తిడి మేరకు కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా పాల్గొనడం ఆహ్వానించదగిన విషయమని మంత్రి అభిప్రాయ పడ్డారు. 

n మంత్రి గంగుల కమలాకర్‌ కొత్తపల్లి మున్సిపాలిటీలో నూ పర్యటించారు. పోశమ్మగుడి వద్ద మొక్కలు నాటిన ఆయన, 8వ వార్డులో పాదయాత్ర చేశారు. ప్రజలతో మాట్లాడి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. తుప్పుపట్టిన విద్యుత్తు స్తంభాలను తొలగించి కొత్తవి వేసే పనులను కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ శశాంక కూడా కొత్తపల్లిని పట్టణంలోని పలు వార్డులో పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించారు. సంఘం చౌరస్తా, అంగడి బజార్లలో తిరిగారు. అక్కడ గుర్తించిన సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. 

అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌తో కలిసి చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పర్యటించారు. పరిశుభ్రంగా లేని పరిసరాలను గుర్తించి వాటిని శుభ్రం గా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. ఇంకు డు గుంతలను పరిశీలించారు. తుప్పుపట్టిన విద్యుత్తు స్తంభాలను తొలగించిన ఎమ్మెల్యే వాటి స్థానంలో కొత్త వి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ, జి ల్లా అధికారులు వచ్చిన సమాచారాన్ని తనకు ఎందుకు ఇవ్వలేదని స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే పట్టణ ప్రగతి విజయవంతమవుతుందనీ, పనులను గుర్తించడంలో, ప్రణాళికలు రూపొందించడంలో ఎక్కడ కూడా నిర్ల క్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. 

హుజూరాబాద్‌లో పలు వార్డుల్లో రెండు రోజుల పాటు గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు పనులు ప్రారంభించారు. ముఖ్యంగా పట్టణంలోని 17వ వార్డు లో రోడ్లను శుభ్రం చేశారు. 23, 26వ వార్డుల్లో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్తా చెదారాన్ని, పిచ్చి మొ క్కలను ఫ్రంట్‌ బ్లేడ్‌ ట్రాక్టర్‌తో తొలగించారు. పట్టణంలోని పలు వార్డుల్లో సమస్యలను గుర్తించేందుకు పాదయాత్రలు చేశారు. అటు జమ్మికుంటలోని పలు వార్డు ల్లో ఆర్డీఓ బెన్‌ షాలోమ్‌ పర్యటించి పరిసరాలను పరిశీలించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు రూపొందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. 


logo