బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 27, 2020 , 01:10:28

నాకా చౌరస్తాలో పోలీసుల మాక్‌ డ్రిల్‌

నాకా చౌరస్తాలో పోలీసుల మాక్‌ డ్రిల్‌

కరీంనగర్‌ క్రైం: జిల్లాకేంద్రంలోని నాకా చౌరస్తా వద్ద ఒక సంఘటన జరిగిందనీ, వెంటనే ఆ ప్రదేశానికి చేరుకోవాలని పోలీస్‌ శాఖలోని వివిధ విభాగాలకు బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఉన్నతాధికారులు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. అడిషనల్‌ డీసీపీ (ఎల్‌అండ్‌ఓ) ఎస్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శంకర్‌రాజుతోపాటు క్యూఆర్‌టీ టాస్క్‌ఫో ర్స్‌, ట్రాఫిక్‌, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, బాంబు డిస్పోజబుల్‌ స్కా డ్‌, వివిధ విభాగాలకు చెందిన 250 మంది కేవ లం 20 నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌  కమలాసన్‌రెడ్డి కూడా అక్కడే ఉండి, ఆదేశించడంతో తక్షణమే రంగంలోకి దిగారు. వాహనాల తనిఖీలు చే యడంతోపాటు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. రాత్రి 12గంటల వరకు ఈ తనిఖీలు చేశారు. అయితే సీఏఏ, ఎన్‌ఆర్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైనా సంఘటన జరిగితే పో లీసులు సంఘటన స్థలానికి ఎంత వేగంగా చేరుకుంటారోనని పరిశీలించేందుకే ఈ ‘మాక్‌ డ్రిల్‌' నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకపోవడం, ఇదంతా మాక్‌డ్రిల్‌ అని తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.  ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్‌, విజ్ఞాన్‌రావు, నాగార్జున రావు, శశిధర్‌ రెడ్డి, ఎస్బీఐ ఇంద్రసేన రెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్‌  పాల్గొన్నారు. logo