శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 27, 2020 , 01:09:29

పాట.. తెలంగాణకు ప్రాణం

పాట.. తెలంగాణకు ప్రాణం

తిమ్మాపూర్‌ రూరల్‌: కళకు అద్భుతమైన శక్తి ఉందనీ, పాట.. తెలంగాణకు ఉద్యమ సమయంలో ప్రాణమయ్యిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు.  మండలంలోని రామకృష్ణకాలనీలో గల వాగేశ్వరీ విద్యాసంస్థలో ఎంబీఏ కళాశాల ఆధ్వర్యంలో ‘సావిస్కర-2020’ పేరుతో రెండు రోజులపాటు నిర్వహించిన యూత్‌ఫెస్ట్‌ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి, అభినందించారు. యువ కళాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయని నిర్వాహకులను అభినందించారు.  కళాకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి, ఎంతో మంది కళాకారులకు ఉపాధినిచ్చారని గుర్తుచేశారు. పాటపాడి, విద్యార్థులను ఉర్రూతలూగించారు. అంతకుముందు విద్యార్థులు అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యాసంస్థల సెక్రెటరీ గండ్ర శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రాజేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, కో ఆర్డినేటర్లు డాక్టర్‌ రామచంద్రారావు, డాక్టర్‌ మనోహర్‌, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.logo