శనివారం 30 మే 2020
Karimnagar - Feb 27, 2020 , 01:05:58

‘కార్పొరేట్‌' ముసుగులో దోపిడీ

‘కార్పొరేట్‌' ముసుగులో దోపిడీ

మానకొండూర్‌: కార్పొరేట్‌ ముసుగులో దోపిడీ చేస్తున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు కోరారు. మండల కేంద్రంలోని చాణక్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు దోపిడీకి నిలయాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థులను రోబోలుగా తయారుచేస్తూ వారి మానసికోల్లాసానికి భంగం కల్గిస్తున్నాయని పేర్కొన్నారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందించడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా అత్యున్నతమైన భోదన లభిస్తుందని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలను ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో చదివించాలని కోరారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ఆగడాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ట్రస్మా పక్షాన రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రస్మా మండలాధ్యక్షుడు ఆడెపు రవీందర్‌, రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీ రంగు శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి దాసరి శ్రీపాల్‌రెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు విజయన్‌, శ్రీనివాస్‌, పర్షరాములు, హకీం, తరుణ్‌ పాల్గొన్నారు.


logo