శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 22, 2020 , 02:19:10

శివోహం..

శివోహం..

‘హరహర మహాదేవ.. శంభో శంకర’ నామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

  • ఘనంగా శివరాత్రి వేడుకలు
  • ఉదయం నుంచే భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
  • కొనసాగిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శివపార్వతుల కల్యాణం
  • దర్శించుకున్న ప్రముఖులు
  • జాగారం సందర్భంగా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు

‘హరహర మహాదేవ.. శంభో శంకర’ నామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివరాత్రి సందర్భంగా శుక్రవారం ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మహాదేవుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగాయి. జాగారం సందర్భంగా ఆయా ఆలయాల్లో భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మద్దికుంట శివాలయంలో కలెక్టర్‌ శరత్‌కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.

- నమస్తే తెలంగాణ యంత్రాంగం


 ‘హరోం హర.. హరహర మహాదేవ.. శంభోశంకర..’ అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుంచే ప్రముఖ ఆలయాలకు పోటెత్తారు. జిల్లాలోని శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివుడికి అభిషేకాలతో పాటు పలు పూజలు నిర్వహించారు.  ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఉపవాస దీక్షలు చేపట్టారు. రాత్రంతా జాగరణ చేశారు.   జిల్లాలోని పలు ఆలయాల్లో రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై కార్యక్రమాలను తిలకించారు. 


logo