గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 22, 2020 , 02:16:45

హరహర మహాదేవ

హరహర మహాదేవ

మహాశివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఉద యం శైవాలయాల్లో భక్తులు శివుడి ద ర్శనం కోసం బారులు తీరారు. అత్యం త భక్త్తిశ్రద్ధలతో తెల్లవారుజామున 4 గంట ల నుంచి సాయంత్రం వరకు శివలింగానికి క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, రజత కవచాలంకరణతో పూజలు, అభిషేకాలు,అర్చనలు, ప్రత్యేక పూజలు, శివ కల్యాణాలు జరిపించారు.

  • శివనామ స్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు
  • జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడిన ఆలయాలు
  • ఉదయం నుంచే బారులు తీరిన భక్తులు
  • కనుల పండువగా మహాశివరాత్రి వేడుకలు
  • పలు చోట్ల పాల్గొన్న మంత్రి ఈటల, ఎమ్మెల్యేలు

సుభాష్‌నగర్‌ : మహాశివరాత్రి వేడుకలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఉద యం శైవాలయాల్లో భక్తులు శివుడి ద ర్శనం కోసం బారులు తీరారు. అత్యం త భక్త్తిశ్రద్ధలతో తెల్లవారుజామున 4 గంట ల నుంచి సాయంత్రం వరకు శివలింగానికి క్షీరాభిషేకం, రుద్రాభిషేకం, రజత కవచాలంకరణతో పూజలు, అభిషేకాలు,అర్చనలు, ప్రత్యేక పూజలు, శివ కల్యాణాలు జరిపించారు. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం శివాలయాల్లో భక్తులు పోటెత్తారు. రాత్రిళ్లు శివనామ స్మరణతో అన్ని ఆలయాలు మర్మోగాయి.

*హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని పలు శివాలయాల్లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు చేశారు.

*శంకరపట్నం మండలంలోని చింతలపల్లెలోని శ్రీభ్రమరాంభికా సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


*సైదాపూర్‌ మండలం ఎక్లాస్‌పూర్‌, వెన్నంపల్లి, గుజ్జులపల్లి, బొమ్మకల్‌, తదితర గ్రామాల్లో శివుడికి హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

*చొప్పదండిలోని శివకేశవ ఆలయం లో ఎమ్మెల్యే సుంకెరవిశంకర్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేసి, స్వామివారికి అభిషేకం చేశారు.

*నగరంలోని పురాతన పాతబజార్‌ శివాలయంలోఉదయం మేయర్‌ వై సునీల్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు.


logo