గురువారం 28 మే 2020
Karimnagar - Feb 21, 2020 , 05:28:29

పట్టణ 'పగతి'తో భవితకు బాటలు

పట్టణ 'పగతి'తో భవితకు బాటలు

ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భవిష్యత్తు తరాలకు బాటు వేసే విధంగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉద్భోదించారు.

  • అభివృద్ధే అందరి లక్ష్యం కావాలి
  • ఎన్నికల వరకే రాజకీయాలు
  • ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వద్దు
  • జవాబుదారీతనంతో పనిచేయాలి
  • పట్టణ ప్రగతి సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్‌
  • హాజరైన ఎమ్మెల్యేలు సుంకె, రసమయి, ఎమ్మెల్సీ నారదాసు

 కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ:  ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపడుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భవిష్యత్తు తరాలకు బాటు వేసే విధంగా అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌  అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉద్భోదించారు. గురువారం నగర శివారుల్లోని వీ కన్వెక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశంలో  పాల్గొని మాట్లాడారు. పల్లె ప్రగతి విజయవంతమైన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారని చెప్పారు.  ఈ కార్యక్రమం ఈనెల 24 నుంచి మార్చి 4 వరకు సాగుతుందన్నారు. రాజకీయాలకతీతంగా  భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.   వార్డులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు, ప్ర జాప్రతినిధులు జవాబుదారీతనంలో పని చేయాలన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలని, అనంతరం కేవలం ప్రజల అభివృద్ధ్ది, సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. ప్రజలు ఏ పార్టీ ప్రజాప్రతినిధిపైన అయినా నమ్మకం పెట్టుకొని గెలిపించారని, వారి నమ్మకం వమ్ముకాకుండా వారి పని చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో ముఖ్యంగా విద్యుత్‌ ఇబ్బందులు, రోడ్డు మధ్యలో ఉన్న పోల్స్‌, నగరంలో మహిళలకు ప్రత్యేక టాయిలెట్స్‌  నిర్మించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అక్షరాస్యతతోనే అభివృద్ధ్ది సాధ్యమవుతుందని, దీనిని సాధించేందుకు ప్రతి ఒక్క రూ కృషి చేయాలన్నారు. నగరంలో పార్కింగ్‌ జో న్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.  రోజు రోజుకు పెరిగి పోతున్న కాంక్ట్రీట్‌ జంగల్‌ వల్ల వాతారవణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. దీని వాల్ల స కాలంలో వర్షాలు  కురవడంలేదని విశ్లేషించారు. వాతావరణ సమతుల్యత, భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటటంతో పాటుగా వాటిని సంరక్షించాల్సినా బాధ్యత కూడ ఉందన్నారు. దీనికి కోసం ప్రతి వార్డుల్లోని స్పెషల్‌ అధికారులతో పాటుగా, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాలుపంచుకో వా లన్నారు. పారిశుధ్య పనులను కూడ మెరుగుపర్చుకొవాల్సినా అవసరం ఎంతైనా ఉందన్నారు. పట్టణ ప్రగతిలో వార్డుల అభివృద్ది కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కొక్క దానిలో 15 మంది సభ్యులు ఉంటారన్నారు. 


సకల సదుపాయాలతో  మార్కెట్లు..

అన్ని పట్టణాలు, నగరాల్లో అన్ని సదుపాయాలతో కూడిన కూరగాయాల, మటన్‌, చికెన్‌ మార్కెట్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మనం తీసుకునే ఆహారం కలుషితం వల్లే ఎక్కువగా రోగాలు వస్తాయన్నారు. ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం అన్ని సదుపాయాలతో మార్కెట్లను నిర్మిస్తామన్నారు. పట్టణాలు, నగరాల్లో ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి  పరిష్కారానికి ప్రణాళికలను తయారు చేయాలని అధికారులకు  సూచించారు. వార్డుల వారిగా, న గరం యూనిట్‌గా వేర్వురుగా ప్రణాళికలను సిద్ధ్దం చేసుకొవాలన్నారు. 


అబ్బురపరిచేలా కార్యక్రమం..

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మా ట్లాడుతూ దేశంలోనే అందరిని అబ్బురపర్చే విధ ంగా సీఎం కేసీఆఆర్‌ పట్టణ ప్రగతి కార్యక్రమం రూపొందించారన్నా రు. గ్రామ స్వరాజ్యం రావాలంటే సీఎం కేసీఆర్‌ చేపడుతున్న కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుందని చెప్పారు. కొత్తగా ఏర్పా టు అయినా కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పూర్తిస్థాయిలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.  కలెక్టర్‌ శశాంక మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల్లో బ్రహ్మాండమైన మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. అదే తీరులో పట్టణ ప్రగతిలో మార్పులు రావాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా ప్రతి నెల మున్సిపాలిటీలకు రూ. 146 కోట్ల నిధులు మంజూరు చేస్తుందన్నా రు.   పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగవ్వాలని, పచ్చదనం పెరగాలని తెలిపారు.


జిల్లా సాంస్కృతికంగా, రాజకీయంగా అగ్రస్థానంలో ఉందని, అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో ఉండాలన్నారు. ఈ నెల 24నుంచి మార్చి 4 వరకు సాగుతుందన్నారు. ప్రత్యేకాధికారులు ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 10 వరకు వార్డుల్లో తిరగాలన్నారు. గా ర్బెజీ పాయింట్స్‌ను గుర్తించాలన్నారు. ప్రతి కాలనీలో డ్రైనేజీ సమస్యలు, రోడ్ల సమస్యలు, స్ట్రీట్‌ లైట్‌ సమస్యలు, తాగునీరు, వీదీధీపాలు, సమస్యలుం టే గుర్తించి వాటి పరిష్కరానికి ప్రణాళికలు సిద్ధ్దం చేయాలన్నారు. షాపులను, హోటళ్లను తనిఖీ చేసి ప్లాస్టిక్‌   నిషేధంపై అవగాహన కల్పించాలన్నారు. వార్డుల్లో హరిత ప్రణాళికలను రూ పొందించాలన్నారు. మేయర్‌ వై.సునీల్‌రావు మా ట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్పొరేటర్లు చురుకుగా పాల్గొన్నాలన్నారు. సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా రూ. 70 కోట్లు   వ్యయం చే యనున్నామన్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిపై రూపొందించిన పో స్టర్లు, కరపత్రాలను మంత్రి గంగుల కమలాకర్‌ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో  జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, మేయర్‌  సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రా మకృష్ణారావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, చొప్పదండి, హుజురాబాద్‌, జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్లు, అధికారులు, పాలకవర్గ సభ్యులు, ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo