గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 20, 2020 , 02:41:26

‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేస్తాం

‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేస్తాం


కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  ఈ నెల 24 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్‌లో పకడ్బందీగా అమలు చేస్తామని నగర మేయర్‌ వై సునీల్‌రావు ప్రక టిం చారు. సీఎం ఆదేశాలను తు.చ. తప్పకుండా అమ లు చేస్తామని  పేర్కొన్నారు. బుధవారం  తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సమావేశంలో వివరించి వివరాలను తెలపడంతో పాటుగా.. తా ము పట్టణ ప్రగతిలో చేపట్టే కార్యక్రమాలను కూడ వివరించారు.  ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొనే విధంగా పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని   చెప్పారు. మున్సిపాలిటీలు అంటేనే గతంలో ఉన్న చిన్నచూపు పోయే విధంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధ్దే ధ్యేయంగా పని చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. కరీంనగర్‌ నగరపాలక సం స్థలో పారదర్శకంగా, సభ్యులందరి ఆమోదంతోనే పనులు చేపడుతామన్నారు. ఈ నెల 24 నుంచి చేపట్టనున్న పట్టణ ప్రగతిలో హాడావుడి చేయడం కాకుండా నగరంలోని ప్రతి మూలలో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తిస్తామన్నారు.  ప్రా ధాన్యత క్ర మంలో అందుబాటులో ఉండే నిధుల ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు.   దళిత, మురికివాడల అ భివృద్ధిపై  దృష్టి పెడతామన్నారు.  ఇక నుంచి ప్రతి నెలా  బల్దియాలకు రూ. 70 కోట్ల నిధులు మం జూరవుతాయన్నారు.   


బడ్జెట్‌లోనూ పట్టణ ప్రగతిలో గుర్తించిన సమస్యల పరిష్కరానికి నిధులు కేటాయిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌ సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. గజ్వేల్‌ మాదిరిగా నగరంలో నూ మార్కెట్లను అభివృద్ది చేస్తామన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం నగరంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉందన్న విషయంపై తమకు పూర్తి సమాచారం ఉండేలా చూస్తామన్నారు. ప్రజ లు  సైతం కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాలన్నా రు. నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా టా యిలెట్స్‌ను నిర్మిస్తామని పేర్కొన్నారు.  బల్దియా లో నర్సరీల  ఏర్పాటుతో పాటు నాటిన ప్రతి మొ క్కను సంరక్షించే విధంగా ప్రజలను భాగస్వామ్యులను చేసుకొని ముందుకు సాగుతామన్నారు. డ్రైన్‌ క్లీనింగ్‌ యంత్రాలు కూడ వచ్చాయని సీఎం కేసీఆర్‌ సూచించారని, ఆ మేరకు తగు చర్యలు చేపడుతామన్నారు. వీధి వ్యాపారులకు   ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే వారిని రోడ్లపై అ మ్మకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎనిమి ది నెలల్లోనే రోడ్లపై ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌పోల్స్‌, వైర్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, వీటిని సకాలంలో పూర్తి చేస్తామన్నారు. నగరంలో ప్రమాద రహిత విద్యుత్‌ వ్యవస్థను తయారు చేస్తామన్నారు. నగరంలో రోజు నీటి సరఫరా కు వీలుగా  కొన్ని నెలలుగా ఆగిపోయిన ఫిల్టర్‌బెడ్‌ పనులపై స్పందించిన వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులను వచ్చే నెలల్లో పూర్తయితే ఏప్రిల్‌ నుంచి నగరంలో రోజు నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు.   సమావేశంలో కార్పొరేటర్లు చాడకొండ బుచ్చిరెడ్డి, నేతికుంట యాదయ్య, నేతలు చల్ల హరిశంకర్‌, ఎడ్ల అశోక్‌, పిట్టల శ్రీనివాస్‌, సోహన్‌ పాల్గొన్నారు. 


logo