గురువారం 28 మే 2020
Karimnagar - Feb 17, 2020 , 03:09:35

ఎంత ఎదిగినా సొంతూరికి ముద్దుబిడ్డలమే

ఎంత ఎదిగినా సొంతూరికి ముద్దుబిడ్డలమే

తిమ్మాపూర్‌ రూరల్‌: ఎంత ఎత్తుకు ఎదిగినా  పుట్టి న ఊరికి ముద్దుబిడ్డలమేననీ,   పుట్టిన గడ్డను మ రువకుండా సేవలందించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  ఉద్ఘాటించారు. మండలంలోని రామహనుమాన్‌నగర్‌లో కరీంనగర్‌  మేయర్‌ యాదగిరి సునీల్‌రావుకు ఆదివారం పౌర సన్మా నం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు.  వచ్చునూర్‌ గ్రామం కొహి నూర్‌ లాంటి మేయర్‌ను అందించిందనీ,  తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మేయర్‌ స్థాయికి వెళ్లడం సంతోషంగా ఉందని చెప్పారు. 


ముఖ్యమంత్రి ఆశీర్వాదంతో.. 

మేయర్‌  సునీల్‌రావు మాట్లాడుతూ  20ఏళ్ల కష్టానికి ముఖ్యమంత్రి ఆశీర్వాదం తోడై  మేయర్‌గా అవకాశం వచ్చిందనీ, తమను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన సీఎం, మంత్రి కేటీఆర్‌కు ఎల్లవేళలా రుణపడి ఉంటానని చెప్పారు.  పదవులను ఆశించకుండా ఎన్నో ఏళ్లుగా తన సతీమణి, తాను   సే వలందించమన్నారు.  రానున్న రోజుల్లో మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు  వినోద్‌కుమార్‌ సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పూర్వపు వచ్చునూర్‌ బిడ్డ గా  గర్వపడుతున్నానని చెప్పారు.   ఎలాంటి పని ఉన్నా గ్రామస్తులు వచ్చి కలవచ్చని చెప్పారు.  గ్రామాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వచ్చునూర్‌ గ్రామం ఎల్‌ఎండీలో ముం పునకు గురైనప్పటికీ కూడా ఇంతమంది పౌరస న్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు. 


సర్పంచ్‌ యాదగిరి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. తమ గ్రామంలో పుట్టిన వ్యక్తి మేయర్‌ స్థాయికి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు.  అనంతరం గ్రామపంచాయతీ సమీపంలో అంబేద్కర్‌ సంఘ భవనానికి భూమిచేశారు. అంతకుముందుకు ఎమ్మెల్యేతో కలిసి చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు.  డప్పుచప్పుళ్ల నడుమ పూల వర్షం కురిపిస్తూ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.  కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, ఎంపీటీసీ కనకం కోమురయ్య, పూర్వ గ్రామస్తు లు మానేటి ప్రతాపరెడ్డి, మాడిశెట్టి గోపాల్‌, ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ లెంకల రాధ, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.


logo