శనివారం 30 మే 2020
Karimnagar - Feb 15, 2020 , 01:48:36

11 కేంద్రాలు.. 74 బూత్‌లు

11 కేంద్రాలు.. 74 బూత్‌లు

హుజూరాబాద్‌ నమస్తే తెలంగాణ/ టౌన్‌/రూరల్‌: డివిజన్‌లో నేడు జరుగనున్న సహకార సంఘాల ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. డివిజన్‌లోని 12సంఘాలకు గాను జమ్మికుంట మండలం తనుగుల సహకార సంఘం ఏకగ్రీవం కాగా .. మిగతా 11 సహకార సంఘాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలోని 154 నియోజకవర్గాల్లో 80 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా , మిగతా 74 స్థానాలకు 203మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీని కోసం డివిజన్‌లో 11 పోలింగ్‌ కేంద్రాల్లో 74 బూత్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఇద్దరు ఎన్నికల సిబ్బందితోపాటు ప్రతి కేంద్రానికి ఒక పీవో, ఒక ఏపీవోను నియమించారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.  కాగా హుజూరాబాద్‌ సహకార సంఘానికి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, తుమ్మనపల్లి, జూపాకలో ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే డివిజన్‌లో 74 నియోజకవర్గాల్లో గాను 11,836 మంది రైతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హుజూరాబాద్‌లో 3,7,10,12 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా మిగతా  9 డైరెక్టర్‌ స్థానాలకు 29మంది అభ్యర్థులు, తుమ్మనపల్లి సంఘంలో  6,8,10,11, 12,13 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా,  మిగతా 7 డైరెక్టర్‌ స్థానాలకు 19మంది, జూపాకలో 1,2,3,4,13 నియోజకవర్గాలు ఏకగ్రీవం కాగా, 8 డైరెక్టర్‌ స్థానాలకు 18మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఏసీపీ సుందరగిరి శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేస్తున్నారు.

సైదాపూర్‌: వెన్కేపల్లి-సైదాపూర్‌ సంఘానికి వెన్కేపల్లి ఉన్నత పాఠశాలలో, వెన్నంపల్లి సంఘానికి వెన్నంపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో పోలింగ్‌ జరుగనుంది. వెన్కేపల్లి-సైదాపూర్‌లో 10 మంది పీవోలు, 30మంది ఏపీవోలు, వెన్నంపల్లిలో 8 మంది పీవోలు, 8 మంది ఏపీవోలు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. వెన్కేపల్లి-సైదాపూర్‌ సంఘం పరిధిలోని 13 నియోజకవర్గాల్లో 3 డెరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంకాగా, 10 స్థానాలకు 23 మంది అభ్యర్థులు, వెన్నంపల్లి సంఘం పరిధిలోని 13 నియోజకవర్గాల పరిధిలో 5 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంకాగా, 8 నియోజకవర్గాలకు 21మంది బరిలో ఉన్నారు. 

వీణవంక: వీణవంక సహకార సంఘంలో మొత్తం 13 నియోజకవర్గాల పరిధిలో  రెండు (1, 5వ)  డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 11 నియోజకవర్గాలకు సంబంధించి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 11 డైరెక్టర్‌ స్థానాలకు 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 50 మంది సిబ్బంది పోలింగ్‌లో పాల్గొంటున్నట్లు ఎన్నికల అధికారి రవీంద్రకుమార్‌ తెలిపారు.

జమ్మికుంట రూరల్‌: ఉమ్మడి జమ్మికుంట మండలంలో ఐదు సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా, నేడు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు జయరావు, సమ్మిరెడ్డి, కిషన్‌రావు, గణేశ్‌, సదానందం తెలిపారు. జమ్మికుంట పీఏసీఎస్‌లో 12 నియోజకవర్గాలకు గాను 11 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవంకాగా, మిగిలిన 11వ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే ధర్మారంలో 12 నియోజకవర్గాలకు 6 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 6(1,2,6,7,9,10) నియోజకవర్గాల్లో  13మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇల్లందకుంట పీఏసీఎస్‌లో 13 నియోజకవర్గాలకు గాను, 10 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగతా 3(3,6,10) నియోజకవర్గాలకు 8మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే మల్యాలలో 13 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 8 ఏకగ్రీవంకాగా, మిగతా 5(6,7,9,11,12) డైరెక్టర్‌ స్థానాలకు 12మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే బోగంపాడు పీఏసీఎస్‌లో 12 నియోజకవర్గాలు ఉండగా, ఇందులో 7 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కాగా,  మిగతా 5(1,2,3, 4,12) నియోజకవర్గాల్లో 12మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.logo