గురువారం 28 మే 2020
Karimnagar - Feb 15, 2020 , 01:45:30

పుల్వామా అమరవీరులకు ఘన నివాళి

పుల్వామా అమరవీరులకు ఘన నివాళి

సుభాష్‌నగర్‌: దేశ రక్షణకు ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని ఆల్ఫో ర్స్‌  చైర్మన్‌ డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్‌ స్కూల్‌ ఆఫ్‌ జెన్‌ నె క్ట్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన ‘మేము సైతం సైనికులకు’ మహా ర్యాలీని  ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఏడాది ఫిబ్రవరి14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్ర  దాడిలో  భారత  సైనికులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వారి ఆ త్మకు శాంతి చేకూరాలని కోరారు.  శాంతి ర్యాలీ కోర్టు చౌరస్తా వద్దకు సాగింది. అక్కడ అమర వీరులకు నివాళులర్పించి జాతీయ గీతాలాపన చేశా రు.       

మానేరు విద్యాసంస్థలలో  ‘స్టాండ్‌ ఫర్‌ ది నేష న్‌' లో భాగంగా విద్యార్థులు  జాతీయ గీ తాలాపన చేసి, రెండు నిమిషాలు మౌనం పాటించా రు.   విద్యాసంస్థల చైర్మన్‌ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్‌ కడారి సునీతారెడ్డి, టీచర్లు ఉన్నారు.

స్థానిక భగవతి, ఆర్విన్‌ ట్రీ పాఠశాలలో కొ వ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. అనంతరం మౌనం పాటించి  జాతీయ గీతాలాపన చేశారు. చైర్మన్‌ బీ రమణారావు, కరస్పాండెంట్‌ బీ విజయలక్ష్మి,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫండస్‌ పాఠశాలలో  నేషన్‌ ఇంటిగ్రేషన్‌ కార్యక్రమంలో జిల్లా మెంటర్‌ అండ్‌ ట్రైనర్‌ షాలినీ, ఇంప్యాక్ట్‌ సంస్థ,మానసిక శాస్త్రవేత్త గంప నాగేశ్వర్‌  పాల్గొన్నారు. అమరవీరులకు  నివాళుర్పించి, జాతీయ గీతాలాపన చేశారు.  లయన్స్‌ క్లబ్‌ సౌజన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 120 పాఠశాలల్లో అమరుల త్యాగాలు, భారతదేశ సమగ్రతపై   ర్యాలీలు తీసినట్లు నిర్వాహకులు తెలిపారు.   ప్రిన్సిపాల్‌ పద్మజ ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో..  

 తెలంగాణచౌక్‌: టీఆర్‌ఎస్‌ మహిళా నేత బండ అ నిత అధ్వర్యంలో అమర జవాన్లకు  తెలంగాణ చౌక్‌లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థించారు.  కార్య క్ర మంలో కావ్య, వాణి, ఉష, రమ అంజలి, దివ్య, జ్మోతి, హర్ష, దీప్తి ఆరుణ్‌ పాల్గొన్నారు.

విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ అధ్వ ర్యం లో శుక్రవారం తెలంగాణచౌక్‌ వద్ద అమర జ వాన్లకు ఘన నివాళులర్పించారు. అమరవీరుల చిత్రపటాల పోస్టర్‌ను ప్రదర్శించారు.   బజరంగ్‌దళ్‌ జోనల్‌ కన్వీనర్‌ తోట ప్రదీప్‌కుమార్‌,  వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పుల శ్రీహరి పాల్గొన్నారు.

కరీంనగర్‌ ఎడ్యుకేషన్‌:  మంకమ్మతోటలోని శ్రీ చైతన్య పీజీ కళాశాలలోఅమరజవాన్లకు ఘనంగా శ్రద్ధాంజలి  ఘటించారు.   చైర్మన్‌ ముద్దసాని రమే శ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సదాశివ శర్మ, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌,  విభాగధిపతులు ప్రశాంత్‌, ప్రవీణ్‌, నరేష్‌, రజని, శ్రీలత, రమేశ్‌ పాల్గొన్నారు. 

మంకమ్మతోటలోని శివానీ డిగ్రీ కళాశాలలో వీర జవాన్లకు నివాళులర్పించారు.  ప్రిన్సిపాల్‌ సతీశ్‌కుమార్‌  డైరెక్టర్లు నరేందర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, విజేందర్‌, అధ్యాపకులు ఉన్నారు.


logo