శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 15, 2020 , 01:43:00

పార్కుల పనులను పూర్తి చేస్తాం

పార్కుల పనులను పూర్తి చేస్తాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో హరితహారంపై ప్రత్యేక దృష్టి  పెడ తామని మేయర్‌ వై సునీల్‌రావు పేర్కొన్నారు.  స్థానిక  గీతాభవన్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం ఆర్ట్స్‌ కళాశాల వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్‌తో పాటు డిప్యూటీ మేయ ర్‌ చల్లా స్వరూపారాణి, కార్పొరేటర్లు గందె మాధవి, వాల రమణారావును శాలువాలు, పూల దండలతో సన్మానం చే శారు.  ఈ సందర్భంగా మేయర్‌  మాట్లాడుతూ కరీంనగర్‌లోని వాకర్స్‌ అసోసియేషన్లను ఏకతాటిపైకి తెస్తామన్నారు. వాకర్లకు ఎలాంటి సమస్యలున్నా  పరిష్కరిస్తానన్నారు.   కరీంనగర్‌ అర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌ పార్కు, సర్కస్‌ గ్రౌండ్‌ పా ర్కు పనులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సర్కస్‌ గ్రౌండ్‌లో మే లోగా వాకర్స్‌ కోసం సింథటిక్‌ ట్రాక్‌ నిర్మా ణం పూర్తి చేస్తామని, అలాగే టాయిలెట్స్‌, వాటర్‌ సౌ కర్యం లాంటివి అన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మేయర్‌గా నాకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. మేయర్‌గా కరీంనగర్‌ ప్రజలకు పాలకవర్గ సభ్యులను కలుపుకుని మంచి పరిపాలన అందిస్తామన్నారు. ఇందుకు నగరవాసులు సహకరించాలని కోరారు.  నగరంలోని అన్ని వాకర్స్‌ అసోసియేషన్లు, ప్రజా, మహిళా, ఉద్యోగ, విద్యార్థి తదితర అన్ని సం ఘాలతో పాటు నగర ప్రజలు ప్రతి ఒక్కరూ మొక్కల పెం పకానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పుట్టిన రోజు, వివాహా శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలన్నింటిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రధాన అంశంగా తీసుకోవాలని సూ చించారు.  రానున్న రోజుల్లో పట్టణ ప్రగతి ద్వారా అభివృ ద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో వాకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గందె మహేశ్‌, ఉపాధ్యక్షులు చంద్రమౌ ళి, కార్యదర్శి రవీందర్‌, కోశాధికారి దామోదర్‌చారి, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు  పాల్గొన్నారు. 

ఎడవెల్లి యువసేన ఆధ్వర్యంలో..

రాంపూర్‌ :   మేయర్‌ వై సునీల్‌రావును శుక్రవారం తన కా ర్యాలయంలో ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి యువసేన రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో మ ర్యా దపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  శాలువాతో సన్మా నించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.   సభ్యులు చాడ శ్రీనివాస్‌రెడ్డి, బద్దం జీవన్‌రెడ్డి, పవన్‌కు మార్‌, అర్జున్‌, రమేశ్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మహిళా శిశు సంక్షమ సిబ్బంది..

మేయర్‌  సునీల్‌రావును మహిళా శిశు సంక్షేమ శాఖ సి బ్బం ది   మర్యాదపూర్వకంగా కలిసి  పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.  చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్‌ ఉమారాణి, సూపర్‌వైజర్లు అరుణ, శివజ్యోతి పాల్గొన్నారు. 

 తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఇంజినీరింగ్‌ అసోసియేషన్‌ ఉద్యోగుల ఆధ్వర్యంలో మేయర్‌ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 


logo