గురువారం 28 మే 2020
Karimnagar - Feb 15, 2020 , 01:36:44

మానవత్వాన్ని చాటిన మంత్రి కొప్పుల

మానవత్వాన్ని చాటిన మంత్రి కొప్పుల

చొప్పదండి, నమస్తే తెలంగాణ : రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని తన సొంత కాన్వాయిలో దవాఖానకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌. పూర్తి వివరాలిలా ఉన్నాయి.. చొప్పదండి జవహర్‌ నవోదయ విద్యాలయం సమీపంలో శుక్రవారం సాయంత్రం ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన కొమ్మ భూమయ్య బైక్‌పై నుంచి అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లే సమయంలో ధర్మారం నుంచి కరీంనగర్‌ వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అతడిని గమనించి వెంటనే ఆగి భూమయ్యను తన కాన్వాయిలో దగ్గరుండి కరీంనగర్‌ దవాఖానకు తరలించారు. సరైన సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న క్షతగాత్రుడిని దవాఖానకు తరలించిన మంత్రికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.


logo