గురువారం 04 జూన్ 2020
Karimnagar - Feb 12, 2020 , 01:35:33

అన్ని కోణాల్లో విచారణ

అన్ని కోణాల్లో విచారణ

కరీంనగర్‌ క్రైం : ఇంటర్‌ విద్యార్థిని హత్యకు గురైన ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని కరీంనగర్‌ ఇన్‌చార్జి సీపీ సత్యనారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో హత్యకు గురైన రాధిక ఇంటిని మంగళవారం  ఆయన పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్న సీపీ కేసు దర్యాప్తులో సాధించిన పురోగతిని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. హత్యకు ప్రధానంగా రెండు కారణాలు అయి ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు పోస్టుమార్టం నివేదికల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామనీ, దర్యాప్తు తుది దశకు చేరిందన్నారు. ఈ ఘటనలో నిందితుడికి శిక్ష పడేలా చేసేందుకు స్పష్టమైన ఆధారాలు, సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుందన్నారు. దర్యాప్తు పూర్తి చేసి నిందితుడికి స్పెషల్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు.


logo