శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 12, 2020 , 01:34:56

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ: తనకు వచ్చిన అవకాశాన్ని వి నియోగించుకోని ప్రజలకు  పారదర్శక పాలనను అందిస్తానని నగర మేయర్‌ వై సునీల్‌రావు  ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని చెప్పారు. 33వ డివిజన్‌ పరిధిలోని భగత్‌నగర్‌లో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాగంణంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. అంతకుముందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సునీల్‌రావు కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.    మేయర్‌ ప్రత్యేక పూజ లు చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతం లో ఆలయ సమస్యపై సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించామని గుర్తు చేశారు. మంత్రి గంగుల స హకారంతో రానున్న రోజుల్లో ఆలయాన్ని అన్ని హంగులతో అభివృద్ధ్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి సమస్యపై స్పందించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నా రు. స్మార్ట్‌సిటీ నిధులతో ఇప్పటికే స్మార్ట్‌ రోడ్లను నిర్మిస్తామని పేర్కొన్నారు. 20 ఏళ్లు వరకు రోడ్లను తవ్వేందుకు వీలు లేకుండా ముందస్తు ఆలోచనతో  నిర్మిస్తామన్నారు.కార్యక్రమంలో చీటీ రామారావు, కొమురయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఉపేందర్‌, వెంకట్రావ్‌, శ్రీనివాస్‌, సత్యం తదితరులు ఉన్నారు. 

  టెస్కాబ్‌ చైర్మన్‌ అభినందనలు..

 కరీంనగర్‌ మేయర్‌  సునీల్‌రావును మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు కలుసుకొని పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.  రెడ్డి యువజన సంఘంనేతలు  ఆయన్ను సన్మానించారు. నాయకులు ప్రశాంత్‌రెడ్డి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. 

  విద్యార్థుల ఆత్మీయ సత్కారం..

సుభాష్‌నగర్‌: స్థానిక భగత్‌నగర్‌ వివేకానంద విద్యానికేతన్‌ విద్యాసంస్థల స్కౌట్‌ ట్రూప్‌ విద్యార్థులు కలెక్టర్‌ కాంప్లెక్స్‌లోని హెలీప్యాడ్‌ గ్రౌండ్‌ వద్ద గల ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం కమిటీ, వివేకానంద పాఠశాల, భగత్‌నగర్‌ కాలనీవాసులు మంగళవారం సంయుక్తంగా నగర మేయర్‌ యాదగిరి సునీల్‌రావుకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు.   పాఠశాల వ్యవస్థాపకుడు సౌగాని కొమురయ్య, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ట్రూప్‌ విద్యార్థులు భగత్‌నగర్‌ చౌరస్తా లో ఘన స్వాగతం పలికారు. కవాతుతో ఆలయ సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం స్కౌట్‌ అండ్‌ గైడ్‌ మాస్టర్‌ గోపగాని మల్లయ్య గౌడ్‌ , విద్యార్థులు మేయర్‌కు పూలబోకెను అందజేసి సన్మానించారు.   పాఠశాల చైర్మన్‌ సౌగాని అనుదీప్‌, ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌రావు, ఏఓ తుంగాని సంపత్‌, స్కౌట్‌ మాస్టర్‌ గోపగాని మల్లయ్య గౌడ్‌ ఉన్నారు.


logo