శనివారం 06 జూన్ 2020
Karimnagar - Feb 12, 2020 , 01:27:20

ఆర్టీసీకి ‘మేడారం’ ఆదాయం రూ.5.51 కోట్లు

ఆర్టీసీకి ‘మేడారం’ ఆదాయం రూ.5.51 కోట్లు

కమాన్‌చౌరస్తా : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ద్వారా ఈ నెల 2 నుంచి 9 వరకు ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌కు రూ.5,51,27,947ల ఆదాయం సమకూరినట్లు ఆర్‌ఎం పబ్బ జీవన్‌ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజియన్‌లోని 10 డిపోల నుంచి నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా (పోను-రాను) 5599 ట్రిప్పులతో 2,19,387 మంది భక్తులు ప్రయాణించినట్లు వెల్లడించారు. దాదాపు రెండు వేల పైచిలుకు మంది సిబ్బందితో భక్తులను మేడారానికి సురక్షితంగా చేరవేసి, తిరిగి జిల్లాలకు చేర్చామన్నారు. కాగా, డిపోల వారీగా నడిపిన ప్రత్యేక బస్సుల వివరాలిలా ఉన్నాయి. గోదావరిఖని డిపో నుంచి 1071 ట్రిప్పులతో 39,312 మంది భక్తుల ప్రయాణించగా రూ.92,84,964లు, హుజూరాబాద్‌ డిపో నుంచి 372 ట్రిప్పులతో 17,469 మంది ప్రయాణించగా, రూ.55,08,497లు, జగిత్యాల డిపో నుంచి 830 ట్రిప్పులతో 25,380 మంది ప్రయాణించగా రూ.78,20,841లు, కరీంనగర్‌ 1వ డిపో నుంచి 638 ట్పిప్పులతో 24,161 మంది ప్రయాణించగా రూ.58,82,565లు, కరీంనగర్‌ 2వ డిపో నుంచి 628 ట్రిప్పులతో 19,498 మంది ప్రయాణించగా రూ.63,62,167లు, కోరుట్ల డిపో నుంచి 374 ట్రిప్పులతో 18,092 మంది ప్రయాణించగా రూ.45,20,274లు, మంథని డిపో నుంచి 736 ట్రిప్పులతో 20,178 మంది ప్రయాణించగా రూ.55,79,658లు, మెట్‌పల్లి డిపో నుంచి 184 ట్రిప్పులతో 10,232 మంది ప్రయాణించగా రూ. 27,14,004లు, సిరిసిల్ల డిపో నుంచి 378 ట్పిప్పులతో 27,510 మంది ప్రయాణించగా రూ.45,80,468లు, వేములవాడ డిపో నుంచి 388 ట్రిప్పులతో 17,555 మంది ప్రయాణించగా రూ.28,74,509ల చొప్పున ఆదాయం వచ్చిందని ఆర్‌ఎం వివరించారు. 2018లో జరిగిన జాతర కంటే ఈ యేడు మరింత ఎక్కువ మంది భక్తులను చేరవేసి ఆదాయాన్ని పెంచామని తెలిపారు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో ఆదాయాన్ని పెంచుకునేందుకు తప్పకుండా బస్సులను నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు రక్షణతో కూడిన ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు.


logo