సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Feb 11, 2020 , 01:48:31

ప్రతిభావంతురాలికి చేయూత

ప్రతిభావంతురాలికి చేయూత

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: జాతీయస్థాయి సైక్లింగ్‌ పోటీలకు ఎంపికైన ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని పీ శృతికి అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ వీ నరేందర్‌రెడ్డి స్పోర్ట్స్‌ సైకిల్‌ను అందించి చేయూతనిచ్చారు. డిసెంబర్‌ 20 నుంచి 22 వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు నగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని శృతి ఎంపికైంది. నిరుపేద విద్యార్థిని కావడంతో సైకిల్‌ కొనే స్థోమత లేకపోవడంతో శృతి ప్రతిభను గుర్తించిన అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి స్పోర్ట్స్‌ సైకిల్‌ను కొనుగోలు చేసి సోమవారం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ చేతుల మీదుగా ఆయన క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ అల్ఫోర్స్‌ విద్యాసంస్థలు రాష్ట్ర, జాతీయ స్థాయి ర్యాంకులను ప్రతి సంవత్సరం సాధిస్తూ సత్తాచాటుతున్నాయని, నరేందర్‌రెడ్డి కృషి ఫలితంగా నేడు  జిల్లాకు చెందిన విద్యార్థులు క్రీడా పోటీల్లో సైతం రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కార్పొరేటర్‌ బండారి వేణు, టీఆర్‌ఎస్‌ నాయకులు సూర్య శేఖర్‌, వెంకట్‌, సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, సురభి వేణుగోపాల్‌, అరవింద్‌, వీ జగదీశ్వరాచారి, రమేశ్‌, కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo