బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 11, 2020 , 01:46:54

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

హుజూరాబాద్‌ రూరల్‌/జమ్మికుంట/రూరల్‌/వీణవంక/సైదాపూర్‌/ఇల్లందకుంట: సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. డివిజన్‌లోని 12సంఘాల్లో 154 వార్డులకు గాను 554మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాలుగు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ తరువాత 154స్థానాలకు గాను 79వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 75వార్డులకు 203 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల15న జరుగనున్న సహకార సంఘాల ఎన్నికలకు బ్యాలెట్‌ బాక్సులను అధికారులు  సిద్ధం చేస్తున్నారు. 

జమ్మికుంట మండలం తనుగుల సంఘంలో 12 వార్డులకు 25 మంది నామినేషన్లు వేయగా.. 13మంది ఉపసంహరించుకోగా అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. జమ్మికుంట సంఘం పరిధిలోని 13వార్డులకు 46మంది నామినేషన్లు వేయగా 40 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 11వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన రెండు (7,11) వార్డులకు ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా ఆ రెండు వార్డులు సైతం ఏకగ్రీవమైనట్లు తెలిసింది. అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సంఘం ఏకగ్రీవం కోసం మాజీ రాష్ట్ర సహకార సంఘాల అధ్యక్షుడు, ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు ప్రత్యేక చొరువ తీసుకున్నట్లు తెలుస్తున్నది.

ధర్మారం సంఘంలో 12వార్డులకు 36మంది నామినేషన్లు దాఖలు చేయగా 19మంది ఉపసంహరించుకున్నారు. దీంతో ఆరు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా ఆరు వార్డులైన ( 3,4,5,8,11,12) స్థానాలకు గాను 17మంది పోటీలో ఉన్నారు. 

హుజూరాబాద్‌లో 13వార్డులకు 56 నామినేషన్లు పడగా ఇందులో 23మంది ఉపసంహరించుకున్నారు. దీంతో మూడు వార్డులు ఏకగ్రీవం కాగా   (3,7,12వార్డులు) మిగతా 9 స్థానాలకు 29మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తుమ్మనపల్లిలో 36మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో11మంది ఉపసంహరించుకోగా ఆరు వార్డులు ఏకగ్రీవం (6,8,10,11,12,13) అయ్యాయి. మిగతా 7వార్డులకు 19మంది బరిలో ఉన్నారు. జూపాకలో 39మంది నామినేషన్‌ దాఖలు చేయగా 19 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 5వార్డులు (1,2,3,4,13)ఏకగ్రీవం కాగా, 8 వార్డులకు 18మంది బరిలో ఉన్నారు. 

వీణవంకలో 13వార్డులకు 75 మంది నామినేషన్లు వేయగా, 37మంది ఉపసంహరించుకున్నారు. ఇందులో రెండు(1,5) వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగతా వార్డులకు 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

వెన్కెపల్లి-సైదాపూర్‌ సంఘంలో 13వార్డులకు 58మంది నామినేషన్లు వేయగా 32మంది ఉపసంహరించుకున్నారు. ఇందులో మూడు (8,10,12)వార్డులు ఏకగ్రీవమయ్యాయి, కాగా మిగతా పది వార్డులకు 23మంది బరిలో ఉన్నారు. వెన్నంపల్లి సంఘంలో 13 వార్డులకు 47 నామినేషన్లు రాగా 20 మంది ఉపసంహరించుకోగా 5వార్డులు(5,08,11,12,13) ఏకగ్రీవమయ్యాయి. మిగతా 8వార్డులకు 21మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

ఇల్లందకుంట మండలం మల్యాలలో 13వార్డులకు 27 నామినేషన్లు రాగా ఇందులో ఏడుగురు విత్‌ డ్రా చేసుకోగా 8వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 5వార్డులు(5,8,11,12,13)లకు 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  బోగంపాడులో 13వార్డులకు 32మంది నామినేషన్‌ వేయగా 13 మంది విత్‌డ్రా చేసుకున్నారు. 8వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 5వార్డులకు (1,2,3,4,12) 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇల్లందకుంట సంఘంలో 13 వార్డులకు 51 నామినేషన్లు రాగా 33మంది ఉపసంహరించుకున్నారు, దీంతో 10వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా మూడు వార్డులు(3,6,10) స్థానాలకు 8మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


logo