శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 11, 2020 , 01:43:39

‘ఉపాధి హామీ’ పనుల్లో వేగం పెంచాలి

‘ఉపాధి హామీ’ పనుల్లో వేగం పెంచాలి

వీణవంక: ప్రజాప్రతినిధులు, అధికారులు మండలంలో జరుగుతున్న ఉపాధిహామీ పథకం పనుల్లో వేగం పెంచాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు ముసిపట్ల రేణుక ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, నర్సరీల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి అందరూ కృషి చేయాలన్నారు. పల్లెప్రగతిలో, గ్రామాల అభివృద్ధి కోసం ఈజీఎస్‌ ద్వారా చేసిన పనులకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు. గ్రామాల్లో ప్రతి అభివృద్ధి పనికి సర్పంచ్‌, ఎంపీటీసీ, కార్యదర్శులు బాధ్యత వహించాలన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు అయ్యేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజీవ్‌ మల్హోత్రా, ఈఓపీఆర్డీ రాజగోపాల్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.


logo