శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 10, 2020 , 01:30:55

ముగిసిన పరిశీలన

ముగిసిన పరిశీలన

 కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆదివారం అధికారులు నిర్వహించారు. 30 సహకార సంఘాల పరిధిలోని 385 ప్రాదేశిక నియోజకవర్గాలకు వచ్చిన మొత్తం నామినేషన్లను ఆయా సంఘాల పరిధిలోని ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఈ మేరకు నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను తిరస్కరించారు. ఒక అభ్యర్థి రెండు అంతకు మించి దాఖలు చేసిన నామినేషన్లను తొలగించారు. ఇలా 23   తిరస్కరించగా మ రో 58 డబుల్‌ నామినేషన్లను తొలగించారు. కాగా వివరాలు సోమవారం అధికారికంగా వెల్లడిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.. logo