బుధవారం 03 జూన్ 2020
Karimnagar - Feb 09, 2020 , 01:47:51

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

ప్రశాంతంగా ప్రవేశ పరీక్ష

చొప్పదండి, నమస్తే తెలంగాణ: జవహర్‌ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 397 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, జిల్లాలోని పలు మండలాలనుంచి 285 మంది   పరీక్షకు హజరయ్యారనీ, 112 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ మంగతాయారు తెలిపారు. తాసిల్దార్‌ సరిత, మండలవిద్యాధికారి రాజస్వామి, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షించారు. 


logo