శనివారం 30 మే 2020
Karimnagar - Feb 08, 2020 , 02:19:04

తల్లులకు వందనం

తల్లులకు వందనం

చొప్పదండి, నమస్తేతెలంగాణ: మండల కేంద్రంతో పాటు ఆర్నకొండ, గుమ్లాపూర్‌, రాగంపేట గ్రామాల్లో  గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు బారులు తీరారు. అమ్మవార్లను దర్శించుకొని, బంగారం(బెల్లం) సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. చొప్పదండిలో వనదేవతలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎంపీపీ చిలుక రవి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సింగిరెడ్డి కిష్టారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు వనదేవతలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ నిర్వాహకులు, కులసంఘాలు, యువజనసంఘాల సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రామడుగు: మండలంలోని తిర్మలాపూర్‌లో గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ దర్శించుకున్నారు. జాతర నిర్వాహకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్‌ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడి రవీందర్‌తో కలిసి వనదేవతలకు పూజలు నిర్వహించారు. షానగర్‌ తాటివనంలో వెలసిన సమ్మక్క-సారలమ్మను జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు జడ్పీటీసీ దంపతులను శాలువాతో సత్కరించారు. అలాగే గోపాల్‌రావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సర్పంచులు పంజాల ప్రమీల, మానస, ఎంపీటీసీలు మడ్డి శ్యాంసుందర్‌, వంచ మహేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తడగొండ అంజయ్య, తిర్మలాపూర్‌ మాజీ సర్పంచ్‌ సత్యరాజ్‌వర్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు పంజాల జగన్‌మోహన్‌గౌడ్‌, విష్ణు, హన్మంతు, పూరెల్ల అంజయ్య, అనుపురం తిరుపతి, రాజేశం, సత్తయ్య, గౌడ యూత్‌ సభ్యులు పూరెల్ల శేఖర్‌, మనోజ్‌, పొన్నం శేఖర్‌ పాల్గొన్నారు.

గంగాధర: మండలంలోని బూరుగుపల్లిలో సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్లకు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, గంగాధర ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, వైస్‌ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, నాయకులు అట్ల శేఖర్‌రెడ్డి, ఆకుల మధుసూదన్‌, దూలం శంకర్‌గౌడ్‌, గడ్డం స్వామి, వంగల మల్లికార్జున్‌, తదితరులు వనదేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

కరీంనగర్‌ రూరల్‌: కొత్తపల్లి మండలం చింతకుంట, కరీంనగర్‌ మండలం ఇరుకుల్ల, నగునూర్‌, బొమ్మకల్‌లోని హౌసింగ్‌ బోర్డులో గద్దెలపై కొలువుదీరిన వన దేవతలను శుక్రవారం భక్తులు దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సంస్కృత పండితుడు శ్రీభాష్యం విజయసారథి, కరీంనగర్‌ జడ్పీటీసీ, ఎంపీపీ పురుమల్ల లలిత, తిప్పర్తి లక్ష్మయ్య, బొమ్మకల్‌ సర్పంచ్‌ పురుమల్ల శ్రీనివాస్‌, బీజేపీ నాయకులు సుగుణాకర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్ల రమేశ్‌, భక్తులు అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo