శుక్రవారం 05 జూన్ 2020
Karimnagar - Feb 08, 2020 , 02:14:31

వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు

హుజూరాబాద్‌ రూరల్‌: మండలంలోని సింగాపూర్‌ గ్రామంలో గల శ్రీ పద్మావతీ, గోదా సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడు, ఆలయ కమిటీ చైర్మన్‌ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు సరోజన దంపతులు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్‌ డాక్టర్‌ షమిత దంపతులు పాల్గొన్నారు. ముందుగా వేద పండితుల పుణ్యహవచనం, రక్షాబంధనం, రిత్విక్‌ వరణం, శాల ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ, తదితర కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛరణ మధ్య శాస్ర్తోక్తంగా నిర్వహించారు. గోవింద నామస్మరణ మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించారు. స్వామి వారి రథాన్ని లాగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. వొడితల కుటుంబ సభ్యులు, భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. నేడు రెండో రోజు ఉత్సవాల్లో శ్రీభాష్యం విజయసారథి పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు ఆలయ చైర్మన్‌ కెప్టెన్‌ తెలిపారు. 


logo