సోమవారం 01 జూన్ 2020
Karimnagar - Feb 07, 2020 , 02:00:47

‘సహకార’ నామినేషన్లు షురూ..

‘సహకార’ నామినేషన్లు షురూ..

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉదయం 11గంటల నుంచి ఆయా సంఘాల్లో నామి నేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నామినేషన్లకు తొలిరోజు కావడంతో పోటీ చేయాలనుకునే వారు ఎక్కువగా ఓటరు జాబితాను సేకరిం చుకున్నారు. అయితే, మొదటి రోజు 30 సంఘాల పరిధిలో 144 నామినేషన్లు వచ్చా యి. ఒక్కో సంఘం పరిధిలో ఒకటి నుంచి 10 వరకు నామి నేషన్లు వేశారు. ఆయా సంఘా ల్లోని సభ్యులు చాలా చోట్ల సాదాసీదాగా వచ్చి నామినేషన్లు సమర్పించడం కనిపించింది. నామినేషన్ల స్వీకరణకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా సహకార అధికారి సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ పర్యవేక్షించారు. 


కరీంనగర్‌ సొసైటీలో అత్యధికంగా 10 నామినేషన్లు..

మొదటి రోజు నామినేషన్లలో కరీంనగర్‌ ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 10 మంది నామినేషన్లు వేశారు. రామడుగు సింగిల్‌ విండోకు 9, మానకొండూర్‌ మండలం దేవంపల్లిలో మరో 9, చొప్పదండిలో 8, గంగా ధర మండలం కురిక్యాలలో 8, రామడుగు మం డలం కొక్కెరకుంటలో మరో 8 చొప్పున తొలి రోజు అత్యధికంగా నామినేషన్లు వచ్చా యి. సైదాపూర్‌, ఇల్లందకుంట మండలం బోగంపాడు, కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌లోని ఒక్కో సం ఘంలో ఆరు చొప్పున నామినేషన్లు దాఖల య్యాయి. ఇల్లందకుంట, ఇదే మండ లం మల్యాల, జమ్మికుంట మండలం తనుగు ల, జమ్మి కుంటలో తొలి రోజు ఒక్కో నామినే షన్‌ మాత్రమే వచ్చాయి. 


మండలాలవారీగా చూస్తే మానకొండూర్‌లో 25..

మండలాలవారీగా పరిశీలిస్తే ఇల్లందకుంటలోని మూడు సంఘాలకు 8, సైదాపూర్‌లోని రెండు సంఘాలకు 10, హుజూరాబాద్‌లోని మూడు సంఘాలకు 8, తిమ్మాపూర్‌లోని రెండు సం ఘాలకు 10, శంక రపట్నంలోని మూడు సం ఘాలకు 11, చిగురుమామిడిలోని ఒక సం ఘానికి 3, చొప్పదండిలోని రెండు సంఘాలకు 11, గం గాధరలోని రెండు సం ఘాలకు 13, జ మ్మికుంటలోని మూడు సంఘాలకు 7, వీణ వంకలోని ఒక సం ఘానికి 5, రా మడుగులోని 2 సం ఘాలకు 17, కరీంనగర్‌లోని 2 సంఘాలకు 16, మానకొండూర్‌లోని 4 సం ఘాలకు 25 చొప్పున మొత్తంలో 30 సంఘాల పరిధిలో తొలి రోజు 144 నామినేషన్లు దాఖలైనట్లు డీసీవో సీహెచ్‌ మనోజ్‌కుమార్‌ తెలిపారు. 


logo